గత రెండు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో కెరీర్‌ను కొనసాగిస్తున్న నటి కరీనా కపూర్ ఖాన్ (Kareena Kapoor Khan) ‘త్రీ ఇడియట్స్’, ‘గోల్ మాల్-3’, ‘బజరంగీ భాయిజాన్’, ‘ఉడ్తా పంజాబ్’ వంటి చిత్రాల్లో నటించి అభిమానులను అలరించారు. కరీనా సోదరి కరిష్మా కపూర్ (Karisma Kapoor)కూడా బాలీవుడ్ నటి అన్న సంగతి తెలసిందే. కరిష్మా జూన్ 25న పుట్టిన రోజు జరుపుకొంటున్నారు. ఈ నేపథ్యంలో కరీనా సోషల్ మీడియాలో ఆమె ఫోటోను షేర్ చేశారు. ఓ మెసేజ్‌ను కూడా అభిమానులతో పంచుకున్నారు.
తన సోదరి కరిష్మా కపూర్‌కు సోషల్ మీడియా వేదికగా కరీనా శుభాకాంక్షలు తెలిపారు. కరిష్మా చిన్నప్పటి ఫొటోను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘‘మా కుటుంబానికి గర్వకారణం. నీ ఫొటోల్లో నా ఫేవరేట్ ఇదే. ఇప్పుడు అందరు కలసి చెప్పండి మా ‘లోలో’ కు హ్యాపీ బర్త్ డే. నువ్వే ఎప్పటికి నా బెస్ట్ సోదరివి’’ అని కరీనా పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్‌కు అనేక మంది సెలబ్రిటీలు తమ స్పందనను తెలిపారు. రణ్వీర్ సింగ్ (Ranveer Singh), జోయా అక్తర్ (Zoya Akhtar), నేహా ధూపియా(Neha Dhupia) తదితరులు ‘లోలో’ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. కరిష్మా కపూర్‌ను అభిమానులు ముద్దుగా ‘లోలో’ అని పిలుస్తారన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరీనా కపూర్ తన కుటుంబంతో కలసి లండన్‌లో హాలీడేను ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ‘లాల్ సింగ్ చద్దా’లో నటించారు. ఆమిర్ ఖాన్, నాగ చైతన్య కీలక పాత్రలు పోషించారు. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఈ మూవీ విడుదల కానుంది.