ఊహాచిత్రం గీయగలరా!

ABN , First Publish Date - 2020-06-28T05:30:00+05:30 IST

పోలీసులు నేరస్థుల ఊహాచిత్రాలు గీయించడం సినిమాల్లో చూసే ఉంటారు కదా! వారిని చూసిన వ్యక్తి పోలికలు చెబుతూ ఉంటే ఆర్టిస్టు బొమ్మ వేస్తుంటారు. ఇదిగో... ఈ గేమ్‌ కూడా అలాంటిదే...

ఊహాచిత్రం గీయగలరా!

పోలీసులు నేరస్థుల ఊహాచిత్రాలు గీయించడం సినిమాల్లో చూసే ఉంటారు కదా! వారిని చూసిన వ్యక్తి పోలికలు చెబుతూ ఉంటే ఆర్టిస్టు బొమ్మ వేస్తుంటారు. ఇదిగో... ఈ గేమ్‌ కూడా అలాంటిదే. ఈ ఆట మీ ఊహాశక్తిని పెంచుతుంది. ఆడుకోవడానికి ఇద్దరుంటే సరిపోతుంది. 


కావలసినవి:

  1. కొన్ని తెల్ల పేపర్లు
  2. పెన్సిల్‌ లేదా స్కెచ్‌ పెన్నులు
  3. కొన్ని బొమ్మలు


ఇలా చేయాలి...

  1. ఇద్దరూ ఒక దగ్గర కూర్చోవాలి. ఎదురెదురుగా కాకుండా, తలా ఒకవైపు తిరిగి కూర్చోవాలి.
  2. ఎవరు బొమ్మ గీయాలి, ఎవరు బొమ్మ గురించి వివరించాలి అనేది ముందుగానే నిర్ణయించుకోవాలి.
  3. ఏ బొమ్మ తీసుకుంటున్నారో, గీసే వ్యక్తికి తెలియకూడదు. ఒకరు ఏదైనా చిత్రాన్ని చేతుల్లోకి తీసుకుని దాని గురించి వివరిస్తూ ఉండాలి. అంటే బొమ్మ గీసేందుకు అవసరమైన హింట్స్‌ ఇస్తుండాలి. అయితే ఆ బొమ్మ పేరు బయటకు చెప్పకూడదు.
  4. ఈ గేమ్‌ వల్ల పిల్లల్లో ఊహాశక్తి పెరుగుతుంది. డ్రాయింగ్‌ స్కిల్స్‌ పెరుగుతాయి.

Updated Date - 2020-06-28T05:30:00+05:30 IST