వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్‌కు ఘోర అవమానం

ABN , First Publish Date - 2021-04-11T21:00:58+05:30 IST

తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌కు ఘోర అవమానం ఎదురైంది. ఏపీ మత్స్యశాఖ మంత్రి అప్పలరాజు, రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ,

వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్‌కు ఘోర అవమానం

నెల్లూరు: తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌కు ఘోర అవమానం ఎదురైంది. ఏపీ మత్స్యశాఖ మంత్రి అప్పలరాజు, రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు సాక్షిగా ఎమ్మెల్యేపై స్థానిక మత్స్యకారులు మండిపడ్డారు. వివరాల్లోకి వెళితే.. తూపిలిపాళెంలో వైసీపీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి మంత్రి, ఎంపీ, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరప్రసాద్ తీరును మత్స్యకారులు తీవ్రంగా ఎండగట్టారు. సముద్ర ముఖద్వారం, తమిళనాడు బోట్ల సమస్యలని ఎమ్మెల్యే పట్టించుకోలేదని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యే సమావేశం నుంచి వెళ్లిపోవాలంటూ పెద్దపట్టున మత్స్యకారులు నినాదాలు చేశారు. వద్దని వారించబోయిన నేతలతో వాగ్వివాదానికి దిగారు. ఎన్నికలప్పుడే తమపై ప్రేమ పుట్టుకొస్తుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం రసాభసగా మారడంతో కార్యక్రమాన్ని మమా అనిపించి అక్కడి నుంచి మంత్రి అప్పలరాజు, ఎంపీ మోపిదేవి వెంకటరమణ తుర్రుమన్నారు.

Updated Date - 2021-04-11T21:00:58+05:30 IST