మళ్లీ విషం కక్కిన కొడాలి నాని

ABN , First Publish Date - 2022-06-29T23:42:20+05:30 IST

మ్మెల్యే కొడాలి నాని. ఇప్పుడు మాజీ మంత్రి. మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు బూతులు మంత్రి అనే బిరుదు ఉండేది. కేబినెట్ విస్తరణలో..

మళ్లీ విషం కక్కిన కొడాలి నాని

గుడివాడ (Gudivada): ఎమ్మెల్యే కొడాలి నాని (Mla Kodali Nani). ఇప్పుడు మాజీ మంత్రి. మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు బూతులు మంత్రి అనే బిరుదు ఉండేది. కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి పోయినా కొడాలి నానికి నోటి దురుసు తగ్గలేదు. మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సమయం, సందర్భం లేకుండా పత్రిపక్షాలపై విరుచుపడేవారు. ఇప్పుడు ఆయన మీడియా ఛానళ్లు, వాటి అధినేతలపై విషం వెళ్లగక్కుతున్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం (Ap Government) పెట్టిన నిబంధనలపై కొన్ని ఛానళ్లు, పత్రికలు కథనాలు, ప్రసారాలు చేశాయి. అవి మాజీ మంత్రి కొడాలికి నచ్చలేదు. ప్రజల పక్షాన వార్తలు రాసిన మీడియా సంస్థల అధినేతలను ఈ మాజీ మంత్రి టార్గెట్ చేశారు. కులాలు, మతాలు మధ్య చిచ్చు పెడుతున్నాయని ఎగిరిపడుతున్నారు. 


తాజాగా ప్రెస్ మీట్ పెట్టిన ఎమ్మెల్యే కొడాలి నాని..  ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (Abn Andhrajyothy)తో పాటు పలు మీడియా ఛానళ్లపై విషయం కక్కారు. సీఎం జగన్‎ (Cm Jagan)ను భష్ట్రు పటిస్తున్నాయని అక్కసు వెళ్లగక్కారు. కోనసీమ (Konaseema) అల్లర్లపై మాట్లాడుతూ కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశాయని అన్నారు. జగన్‎పై మత ముద్రవేస్తున్నాయని ఆరోపించారు. జగన్‏ను అర్జెంటుగా సీఎం పదవి నుంచి దించేయాలని చూస్తున్నాయన్నారు. 


అయితే కొడాలి నాని చేసిన ఈ విమర్శలపై ప్రతిపక్షాలు, పలువురి నుంచి కౌంటర్లు మొదలయ్యాయి. అమలాపురం (Amalapuram) అల్లర్లకు.. జిల్లా పేరు మార్చడం కారణం కదా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న జిల్లాలో కులాల రాజకీయం చేసి చిచ్చు రాజేసిందెవరు?.. అంటూ నిలదీస్తున్నారు. వెండి రథాలకు సంబంధించిన దొంగతనం జరిగితే ప్రభుత్వం.. పోలీస్ వ్యవస్థ ఏం చేసిందనే విమర్శలు కూడా చేస్తున్నారు. కులాలు, మతాలు గురించి అధికారంలోకి రాక ముందు.. వచ్చాక.. జగన్, వైసీపీ (Ycp) నేతలు ఏం మాట్లాడుతున్నారో అందరికీ తెలుసు అని ఎద్దేవా చేస్తున్నారు. మైనస్‎లన్నీ ప్రభుత్వం నుంచి ఉంటే.. అవన్నీ ప్రతిపక్ష పార్టీలు, మీడియా ఛానళ్లపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని బహిరంగానే విమర్శిస్తున్నారు. కొడాలి నానిది నోరా.. తాటిమట్టా.. అని ఎద్దేవా చేస్తున్నారు. 




Updated Date - 2022-06-29T23:42:20+05:30 IST