రూ. 80కి చేరిన కిలో బెల్లం... కారణమిదే!

ABN , First Publish Date - 2020-10-15T15:50:01+05:30 IST

దేశంలో సాధారణంగా బెల్లం కన్నా చక్కెర వినియోగం అధికంగా ఉంటుంది. చక్కెరతో పోల్చిచూస్తే బెల్లం రుచి తక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. అయితే ధర విషయాని...

రూ. 80కి చేరిన కిలో బెల్లం... కారణమిదే!

న్యూఢిల్లీ: దేశంలో సాధారణంగా బెల్లం కన్నా చక్కెర వినియోగం అధికంగా ఉంటుంది. చక్కెరతో పోల్చిచూస్తే బెల్లం రుచి తక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. అయితే ధర విషయానికొస్తే ఇప్పుడు బెల్లం ధర... చక్కెర ధరను దాటిపోయింది. కరోనా కాలంలో జలుబు, దగ్గు, గొంతు సమస్యలను తొలగించుకునేందుకు చాలామంది ప్రత్యేక కషాయం తయారు చేసుకుంటున్నారు. దీనిలో బెల్లాన్ని వినియోగిస్తున్నారు. ఫలితంగా బెల్లానికి మరింత డిమాండ్ పెరిగింది. ఉత్తరప్రదేశ్‌లో కొరతను అధిగమించేందుకు కొత్తగా బెల్లం కర్మాగారాలు, ప్యాకేజింగ్ యూనిట్లు ప్రారంభమయ్యాయి. బెల్లం ధరలు పెరిగిన నేపధ్యంలో 250 గ్రాముల సైజు ప్యాకింగ్‌లోనూ బెల్లం లభిస్తోంది. బహిరంగ మార్కెట్‌లో కిలో బెల్లం ధర రూ. 80 వరకూ చేరింది.

Updated Date - 2020-10-15T15:50:01+05:30 IST