మాట్లాడుతున్న సీఐటీయూ జిల్లా కార్యదర్శి నాగేంద్రబాబు
బద్వేలు, జూలై5 :ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయని పక్షంలో ఈ నెల11వ తేదీనుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మెను నిర్వహిస్తామని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి చంద్రమోహన్‌రాజు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి నాగేంద్రబాబు పేర్కొన్నారు. మంగళవారం ఉద్యోగ, కార్మికుల ఐక్య కార్యాచరణ బద్వేలు కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పారిశుధ్య, ఇంజనీరింగ్ విభాగాల కార్మికులకు గేట్ మీటింగ్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మెను అందరూ జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా నాయకుడు వీరశేఖర్, పట్టణ అధ్యక్షుడు నాగేష్, నాయకులు జీఎల్.నరసింహ, బాల ఓబయ్య, మున్సిపల్ యూనియన్, ఏఐటీయూసీ నాయకులు మల్లికార్జున, నరసయ్య, దేవ సహాయం తదితరులు పాల్గొన్నారు.