Advertisement
Advertisement
Abn logo
Advertisement

అటవీ హక్కు పత్రాలతో భరోసా

ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ


రావికమతం, డిసెంబరు 7: ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలతో గిరిజన రైతులకు శాశ్వత భూ హక్కుతో పాటు భరోసా లభిస్తుందని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చెప్పారు. చీమలపాడు, జడ్‌.బెన్నవరం, టి.అర్జాపురం, కె.కొట్నాపల్లి పంచాయతీల పరిధిలోని 21 గ్రామాల్లో 337 మంది గిరిజన రైతులకు మంగళవారం ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన రైతులకు రైతుభరోసాతో పాటు ఇతర సంక్షేమ పథకాలు నిరాటకంగా అందుతాయన్నారు. ఈ భూముల్లో సాగుకు బ్యాంకు రుణాలు కూడా మంజూరు చేస్తామని చెప్పారు. తహసీల్దార్‌ కనకారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ పైల రాజు, జడ్పీటీసీ సభ్యురాలు తలారి రమణమ్మ, వైసీపీ మండల అధ్యక్షుడు కంచిపాటి జగన్నాథరావు, డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ ముక్కా మహాలక్ష్మినాయుడు, డైరెక్టర్‌ గుమ్ముడు సత్యదేవా, నాయకుడు పతివాడ చిన్నంనాయుడు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement