IPL: గుజరాత్‌ను 144 పరుగులకే కట్టడి చేసిన లక్నో.. ప్లే ఆఫ్స్ బెర్త్ ఎవరిదో?

ABN , First Publish Date - 2022-05-11T02:56:36+05:30 IST

లక్నో సూపర్ జెయింట్స్‌ (Lucknow Super Giants)తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) నిర్ణీత

IPL: గుజరాత్‌ను 144 పరుగులకే కట్టడి చేసిన లక్నో.. ప్లే ఆఫ్స్ బెర్త్ ఎవరిదో?

పూణె: లక్నో సూపర్ జెయింట్స్‌ (Lucknow Super Giants)తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. చేతిలో పుష్కలంగా వికెట్లు ఉన్నప్పటికీ బ్యాట్ ఝళిపించడంలో టైటాన్స్ బ్యాటర్లు విఫలమయ్యారు. లక్నో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు పిండుకోవడం కష్టంగా మారింది.


ఒక్క శుభమన్ గిల్ మాత్రం 49 బంతుల్లో 7 ఫోర్లతో 63 పరుగులు చేయడంతో టైటాన్స్ ఆ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. డేవిడ్ మిల్లర్ 26, రాహుల్ తెవాటియా 22 (నాటౌట్) పరుగులు చేశారు. వృద్ధిమాన్ సాహా (5), మాథ్యూవేడ్ (10), హార్దిక్ పాండ్యా (11) దారుణంగా విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో అవేశ్ ఖాన్ రెండు వికెట్లు తీసుకోగా, మోసిన్ ఖాన్, జాసన్ హోల్డర్ చెరో వికెట్ తీసుకున్నారు.

Read more