జీఎ‌స్‌టీ చెల్లింపుదారులకు ఊరట

ABN , First Publish Date - 2020-04-05T06:00:11+05:30 IST

కరోనా వైరస్‌ ప్రభావంతో భారత్‌ సహా ప్రపంచ దేశాలన్నీ పెను ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. దీంతో ఒక్కసారిగా వాణిజ్య, పారిశ్రామిక రంగాలు కుదేలయ్యాయి.

జీఎ‌స్‌టీ చెల్లింపుదారులకు ఊరట

రిటర్న్‌ దాఖలు, పన్ను చెల్లింపు గడువు పెంపు


కరోనా వైరస్‌ ప్రభావంతో భారత్‌ సహా ప్రపంచ దేశాలన్నీ పెను ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. దీంతో ఒక్కసారిగా వాణిజ్య, పారిశ్రామిక రంగాలు కుదేలయ్యాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని వస్తుసేవల పన్నులో ఉన్న పన్ను చెల్లింపుదారులకు రిటర్న్‌ దాఖలు, పన్ను చెల్లింపు సమయం పెంచటం, వడ్డీ తగ్గించటంతో పాటు పలు రకాల ఇతర మినహాయింపులు ఇవ్వటం జరిగింది. ఆ వివరాలు మీ కోసం.. 


ఇందులో ముందుగా చెప్పాల్సింది ఏమిటంటే.. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను కాంపోజిషన్‌ స్కీమ్‌ (ఇౖక్కౖఖిఐఖీఐౖూ ఖిఇఏఉకఉ) ఎంపిక చేసుకునే పన్ను చెల్లింపుదారులు సంబంధిత అప్లికేషన్‌ను (దీన్నే ఊౖఖక ఎఖిఖీ ఇక్క02 గా వ్యవహరిస్తారు) దాఖలు చేసే గడువును జూన్‌ 30వ తేదీ వరకు పొడిగించటం జరిగింది. వాస్తవానికి ఇది ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే దాఖలు చేసి ఉండాలి. అలాగే, వీరు ఇప్పటి వరకు తీసుకున్న ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ను రివర్స్‌ చేయటానికి దాఖలు చేయాల్సిన ఊౖఖక ఎఖిఖీ ఐఖీఇ03  ను జూలై 31వ తేదీ వరకు దాఖలు చేయవచ్చు. మామూలుగా అయితే దీన్ని ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన 60 రోజుల లోపు అంటే మే 30వ తేదీ లోపు దాఖలు చేయాల్సి ఉంది. 


అలాగే నిర్ణీత సమయంలోపు పన్ను చెల్లించకుంటే ఏటా 18 శాతం చొప్పున వడ్డీ చెల్లించాల్సి ఉండగా దీన్ని పన్ను చెల్లింపుదారుల టర్నోవర్‌ను బట్టి పూర్తిగా తీసివేయటం లేదా 9 శాతానికి తగ్గించటం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలేమిటంటే.. 


గత ఆర్థిక సంవత్సరం టర్నోవర్‌ రూ.5 కోట్లకు మించి ఉన్నవారు: వీరికి ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెలలకు సంబంధించి చెల్లించాల్సిన పన్ను మీద నిర్ణీత తేదీ నుంచి 15 రోజుల వరకు ఎలాంటి వడ్డీ వసూలు చేయరు. ఆ తర్వాత 9 శాతం వడ్డీ చొప్పున కట్టాల్సి ఉంటుంది. అయితే, ఈ సౌలభ్యం సంబంధిత ఎఖిఖీఖ3ఆ రిటర్న్‌లను జూన్‌ 24వ తేదీ కంటే ముందు దాఖలు చేసినప్పుడు మాత్రమే లభిస్తుంది. 


గత ఆర్థిక సంవత్సరం టర్నోవర్‌ రూ.1.5 కోట్ల నుంచి రూ.5 కోట్ల మధ్య ఉన్నవారు: వీరికి ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెలలకు సంబంధించి చెల్లించాల్సిన పన్ను మీద వడ్డీ నుంచి పూర్తి మినహాయింపును ఇవ్వటం జరిగింది. కాకపోతే, ఫిబ్రవరి, మార్చి ఎఖిఖీఖ3ఆ రిటర్నులను జూన్‌ 29వ తేదీలోపు, ఏప్రిల్‌ రిటర్న్‌ను జూన్‌ 30వ తేదీలోపు దాఖలు చేయాల్సి ఉంటుంది. 


గత ఆర్థిక సంవత్సరం టర్నోవర్‌ రూ.1.5 కోట్ల లోపు ఉన్నవారు: వీరికి కూడా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెలలకు సంబంధించి చెల్లించాల్సిన పన్ను మీద వడ్డీ నుంచి పూర్తిగా మినహాయింపు ఇచ్చారు. అయితే, ఫిబ్రవరి ఎఖిఖీఖ3ఆ  రిటర్న్‌ను జూన్‌ 30వ తేదీ, మార్చి ఎఖిఖీఖ3ఆ రిటర్న్‌ జూలై 3వ తేదీ లోపు, ఏప్రిల్‌ రిటర్న్‌ను జూలై 6వ తేదీ లోపు దాఖలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇచ్చిన గడువు లోపు రిటర్నులు దాఖలు చేస్తే లేట్‌ ఫీజు నుంచి కూడా పూర్తి ఉపశమనం లభిస్తుంది. 


ఇంతేకాకుండా ఎఖిఖీఖ1కు సంబంధించి లేట్‌ ఫీజును తొలగించటంతో పాటు కాంపోజిషన్‌ స్కీమ్‌లో ఉన్న వారు దాఖలు చేయాల్సిన త్రైమాసిక రిటర్న్‌ దాఖలు గడువు పొడిగించటం జరిగింది. అయితే, వీటన్నింటికి తగు నియమ నిబంధనలు ఉన్నందున పన్ను చెల్లింపుదారులు, ఆడిటర్లు వీటి గురించి క్షుణ్ణంగా తెలుసుకుని ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రయోజనాలను పూర్తి స్థాయిలో పొందే వీలు ఉంటుంది.


గమనిక: ఈ వ్యాసాల ద్వారా ఇస్తున్న సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. పాఠకులు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు సంబంధిత చట్టాలు/నిబంధనలను కూలంకషంగా పరిశీలించాలి. 

Updated Date - 2020-04-05T06:00:11+05:30 IST