ఆహార పదార్థాలపై జీఎస్‌టీ రద్దు చేయాలి: ఏఐకేఎంఎస్

ABN , First Publish Date - 2022-07-31T02:57:14+05:30 IST

అఖిలభారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) ఆధ్వర్యంలో బుట్టాయిగూడెం తాహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు.

ఆహార పదార్థాలపై జీఎస్‌టీ రద్దు చేయాలి: ఏఐకేఎంఎస్

జంగారెడ్డిగూడెం: అఖిలభారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) ఆధ్వర్యంలో బుట్టాయిగూడెం తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మల సురేష్ మాట్లాడుతూ ఆహార పదార్థాలపై జీఎస్‌టీ రద్దు చేయాలని, అలాగే అటవీ హక్కుల చట్టం 2006 చట్ట సవరణను రద్దు చేయాలని, ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారాన్ని మోపుతున్నాయని మండిపడ్డారు. పారిశ్రామిక వేత్తలు ఆదాని, అంబానీలకు బ్యాంక్‌లోన్‌లు రద్దుచేశారని విమర్శించారు.


ప్రజలపై విపరీతమైన ఆర్థిక భారాన్ని మోపడం సరికాదని మండిపడ్డారు. వ్యవసాయ బోర్లకు విద్యుత్ మీటర్లు బిగించడాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. గోదావరి వరద ముంపు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ధర్మల సురేష్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వడ్లమూడి వెంకటేశ్వరరావు, కొమరం నాగార్జున, పఠాన్ సిలార్, భాష రాజేష్ మిర్తివాడ వెంకటేష్ పీడీఎస్‌యూ నాయకుడు బన్నే వినోద్, బుట్టాయిగూడెం మండల ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-31T02:57:14+05:30 IST