Abn logo
Aug 15 2020 @ 00:56AM

పాత బంగారం అమ్మకంపైనా జీఎ్‌సటీ!

న్యూఢిల్లీ: పాత బంగారం, బంగారు ఆభరణాల అమ్మకాలపైనా జీఎ్‌సటీ భారం పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ లావాదేవీలపై 3 శాతం జీఎ్‌సటీ విధించాలని రాష్ట్రాల ఆర్థిక మంత్రుల కమిటీ సిఫారసు చేసింది. స్మగ్లింగ్‌ బంగారాన్ని పాత బంగారంగా అమ్ముతూ, పన్నులు ఎగవేయడానికి చెక్‌ పెట్టేందుకు ఈ చర్య ఉపకరిస్తుందని కమిటీలో సభ్యులైన కేరళ ఆర్థిక మంత్రి థామస్‌ ఐజాక్‌ చెప్పారు. దీనికి తోడు రాష్ట్రాల్లో జరిగే బంగారం, ఆభరణాల రవాణాకూ ఈ-వే బిల్లులు ప్రవేశపెట్టాలని కమిటీ సిఫారసు చేసింది. 


Advertisement
Advertisement
Advertisement