దారి మళ్లిన ‘జీఎస్టీ’

ABN , First Publish Date - 2020-09-29T08:20:17+05:30 IST

వస్తు సేవల పన్ను (జీఎస్టీ) నష్టపరిహారం కోసం రాష్ట్రాలు ఎన్నిసా ర్లు కేంద్రాన్ని సంప్రదించినా.. లేఖాస్త్రాలతో నిలదీసినా.. ఇచ్చేది లేదని ఒకసారి, లేదులేదు.. ఇస్తాం అని మరోసారి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. జీఎస్టీ నష్టపరిహారాన్ని ఉద్దేశించి వసూలు చేసిన సెస్‌లో రూ. 47,272 కోట్లు దారి మళ్లినట్లు కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తేల్చింది...

దారి మళ్లిన ‘జీఎస్టీ’

  • విలువ రూ.47,272 కోట్లు
  • అమలు కాని రాఫెల్‌ ఒప్పందాలు 
  • అయోమయంగా రైల్వే ఆర్థికపరిస్థితి
  • 100 రోజుల్లోనే మూలన పడ్డ రైలింజన్లు?
  • ఎండగట్టిన కాగ్‌
  • నివేదికపై రాజకీయ ప్రకంపనలు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): వస్తు సేవల పన్ను (జీఎస్టీ) నష్టపరిహారం కోసం రాష్ట్రాలు ఎన్నిసా ర్లు కేంద్రాన్ని సంప్రదించినా.. లేఖాస్త్రాలతో నిలదీసినా.. ఇచ్చేది లేదని ఒకసారి, లేదులేదు.. ఇస్తాం అని మరోసారి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. జీఎస్టీ నష్టపరిహారాన్ని ఉద్దేశించి వసూలు చేసిన సెస్‌లో రూ. 47,272 కోట్లు దారి మళ్లినట్లు కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తేల్చింది. అంతేకాదు.. రాఫెల్‌ యుద్ధవిమానాలతోపాటు.. విదేశీ కంపెనీలతో కేంద్ర ప్రభుత్వం జరుపుకొన్న పలు ఒప్పందాలు అమలవ్వలేదని, రైల్వే తన ఆదాయానికి మసిపూసి మారేడుకాయ చేసిందని, ఆ సంస్థ ఆర్థిక పరిస్థితి అయోమయంగా ఉందని కాగ్‌ ఎండగట్టింది. తూ.చ. తప్పకుండా.. నిజాయితీగా ఆదాయపన్ను చెల్లించే వేతన జీవులకు ఐటీ శాఖ వేధింపుల కు గురిచేసిందని మండిపడింది. ఈ నివేదిక రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తూ.. మోదీ సర్కారుకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది.


జీఎస్టీ నిధుల వార్‌..!

ఇప్పటికే తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలు, పశ్చిమబెంగాల్‌, ఒడిసా ప్రభుత్వాలు జీఎస్టీ నష్టపరిహారం చె ల్లింపుల విషయంలో కేంద్రం తీరుపై గుర్రుగా ఉన్నాయి.  రాష్ట్రాలు చేస్తున్న క్లెయిమ్‌లకు.. కేంద్రం లెక్కలకూ తేడా ఉంది. ఆమొత్తాన్ని రాష్ట్రాలు అప్పు తెచ్చుకోవచ్చని మోదీ సర్కారు చెప్పగా.. ‘‘మీరే అప్పు తీసుకుని, మాకివ్వండి’’ అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఓ దశలో స్పష్టం చే శారు. అయితే.. జీఎస్టీ నష్టపరిహారానికి ఉద్దేశించి 2017 -19 సంవత్సరాల్లో వసూలు చేసిన రూ.47,272 కోట్లు దారి మళ్లాయంటూ కాగ్‌ బట్టబయలు చేసింది. ఈ నివేదికను కేంద్ర ఆర్థిక శాఖ ఖండించింది. 2017-18లో రూ. 62,611 కోట్లు వసూలవ్వగా.. రాష్ట్రాలకు నష్టపరిహారం రూపంలో రూ. 41,146 కోట్లు ఇచ్చామని తెలిపింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ. 95,081 కోట్లు వసూలవ్వగా.. రాష్ట్రాలకు రూ. 69,275 కోట్లు అందజేసినట్లు వివరించింది. కాగ్‌ చెబుతున్న రూ. 47,272 కోట్లను కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఇండియా (సీఎ్‌ఫఐ)లో పెట్టామని, సాధారణంగా ఈ నిధులను తదుపరి ఆర్థిక సంవత్సరం లో నష్టపరిహారానికి వినియోగిస్తామని చెప్పింది.  


రాఫెల్‌ ఒప్పందం ఉల్లంఘించిన దసో 

రక్షణ ఉత్పత్తుల సేకరణలో ప్రభుత్వ ఆఫ్‌సెట్‌ విధానాన్ని కాగ్‌ తప్పుబట్టింది. భారత్‌కు 36 రాఫెల్‌ యుద్ధ విమానాల అమ్మకానికి ఒప్పందం కుదుర్చుకున్న ఫ్రాన్స్‌కు చెం దిన దసో ఏవియేషన్‌ సంస్థ.. టెక్నాలజీని బదిలీ చేయలేదని కాగ్‌ వి మర్శించింది. డీఆర్‌డీవోకు అత్యాధునిక టెక్నాలజీని బదిలీ చేస్తామని దసో ఏవియేషన్‌ పేర్కొందని గుర్తుచేసింది. 2006-18 మధ్యలో పలు విదేశీ కంపెనీల తో రూ. 66,427 కోట్ల మేరకు 46 ఆఫ్‌సెట్‌ కాంట్రాక్టులు కుదుర్చుకున్నారని, ఈ కంపెనీలు 59ు మేరకే తమ ఒప్పందాలను అమలు చేశాయని వెల్లడించింది. 2005లో ఏర్పర్చుకున్న ఒప్పందం ప్రకారం విదేశీ కంపెనీల నుంచి కొనుగోలు చేయాలంటే.. అవి 30ు మేరకు భారత దేశంలో పెట్టుబడులు పెట్టాలి. లేదా టెక్నాలజీని బదిలీ చేయాలి. దసోతోపాటు బోయింగ్‌, రష్యా ఆర్‌వోయీ కూడా పలు హామీలను ఉల్లంఘించాయని కాగ్‌ వెల్లడించింది. కాగ్‌ తాజా నివేదిక మోదీ సర్కారును మళ్లీ చిక్కులో పడేసింది.


వేతన ఉద్యోగులను వేధించిన ఐటీ

వేతన ఉద్యోగులను ఆదాయపన్ను శాఖ (ఐటీ) వేధించడాన్ని కూడా కాగ్‌ తప్పుపట్టింది. సర్కారుకు అనుకూలంగా ఉన్న వర్గాల్లో వేతన జీవులు ముందువరసలో ఉంటారు. నిజాయితీగా ఆదాయపన్ను చెల్లిస్తారు. నిబంధనల మేరకు రిటర్న్‌్‌సను క్లెయిమ్‌ చేస్తారు. 82ు మం ది దాఖలు చేసుకున్న రిటర్న్‌స్‌ క్లెయిమ్‌లకు ఐటీ శాఖ కొర్రీలు పెట్టిందని కాగ్‌ పేర్కొంది. ఆదాయానికి, కోతల కు, క్లెయిమ్‌లకు పొం తన లేదంటూ.. వారికి నోటీసులు ఇచ్చినట్లు గుర్తుచేసింది.  


రైల్వే ఆర్థిక పరిస్థితి దుర్భరం 

రైల్వే ఆర్థిక పరిస్థితి దుర్భరంగా ఉందని, అది పెట్టుబడులకు సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయిందని కాగ్‌ వెల్లడించింది. ఎన్టీపీసీ, కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా అడ్వాన్సుగా డబ్బులు ఇవ్వకపోతే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేదని పేర్కొంది. అయినా.. రైల్వే తన పరిస్థితి గురించి మసిపూసి మారేడుకాయ చేసిందని పేర్కొంది.


సంస్థల అమ్మకం.. టాయ్‌లెట్లు

ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాన్ని కూడా కాగ్‌ తప్పుబట్టింది. ఒకదాన్నుంచి మరొక దానికి వనరుల బదిలీ జరిగిందేతప్ప.. ప్రభుత్వానికి పెద్దగా ఒనగూరిందేమీ లే దని వివరించింది. ఆర్థికంగా దెబ్బతిన్న కంపెనీల అమ్మ కం జరగనే లేదని కాగ్‌ విమర్శించింది. పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యంలో కేవలం 5 శాతమే సాధించినట్లు పేర్కొంది. అటు స్వచ్ఛభారత్‌ అభియాన్‌ కింద కేంద్రం నిర్మించిన టాయ్‌లెట్లపైనా కాగ్‌ మండిపడింది. సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కింద ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, ఎన్‌హెచ్‌పీసీ వంటి సంస్థలు స్కూళ్లలో నిర్మించిన మరుగుదొడ్లలో 40ు కనిపించకుండా పోయాయని చెప్పింది. ఇగతా వాటిలోనూ 72ు మరుగుదొడ్లకు నీటి సౌకర్యం లేదని, 55ు టాయ్‌లెట్లలో హ్యాండ్‌వాష్‌ సదుపాయం లేదని పేర్కొంది.


నివేదిక ఎప్పుడో వచ్చినా..!

నిజానికి 14వ కాగ్‌గా మోదీ ప్రభుత్వం గుజరాత్‌ కేడర్‌కు చెందిన జీసీ ముర్మును ఆగస్టు 8న నియమించింది. 13వ కాగ్‌ రాజీవ్‌ మెహర్షి హ యాంలోనే పైన పేర్కొన్న ఆడిట్‌ జరిగింది. ఆయన తన నివేదికలను గత ఏడాది జనవరిలోనే సమర్పించినప్పటికీ.. ప్రభుత్వం ఈనెల 23వ తేదీన ఉభయ సభలకు సమర్పించడం గమనార్హం.





  ఎవరీ రాజీవ్‌ మెహర్షి?

13వ కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ రాజీవ్‌ మెహర్షీ తాజా కాగ్‌ నివేదికను రూపొందించారు. రెండు నెలల క్రితం కాగ్‌ నుంచి పదవీ విరమణ పొందిన ఆయన 1978 బ్యాచ్‌కు చెం దిన రాజస్థాన్‌ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి. రాజస్థాన్‌ రాష్ట్రంలో కీలక బాధ్యతలు నిర్వహించారు.  ఆ తర్వాత కేంద్ర సర్వీసులకు వెళ్లారు. కేంద్ర ఆర్థిక శాఖ, ఎరువుల శాఖ, విదేశీ వ్యవహారాల శాఖల్లో కార్యదర్శిగా, వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా, కేబినెట్‌ సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. 2017 ఆగస్టులో పదవీ విరమణ పొందారు. ఆ తర్వాతి రోజే కాగ్‌గా నియమితులయ్యారు. 


Updated Date - 2020-09-29T08:20:17+05:30 IST