ఏపీ సహా 16 రాష్ట్రాలకు జీఎస్టీ నిధులు

ABN , First Publish Date - 2020-10-24T08:48:18+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ సహా 16 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.6 వేల కోట్ల మేరకు కేంద్ర ఆర్థిక శాఖ జీఎస్టీ పరిహారం తొలిదశ

ఏపీ సహా 16 రాష్ట్రాలకు జీఎస్టీ నిధులు

న్యూఢిల్లీ, అక్టోబరు 23: ఆంధ్రప్రదేశ్‌ సహా 16 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.6 వేల కోట్ల మేరకు కేంద్ర ఆర్థిక శాఖ జీఎస్టీ పరిహారం తొలిదశ బకాయిల కింద సర్దుబాటు చేసింది.

ఈ మొత్తాన్ని మార్కెట్ల నుంచి రుణాల రూపంలో సేకరించినట్టు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఏపీ, అస్సాం, బిహార్‌, గోవా, గుజరాత్‌, హరియాణ, హిమాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, మేఘాలయ, ఒడిసా, తమిళనాడు, త్రిపుర, యూపీ, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలు సహా ఢిల్లీ, జమ్ముకశ్మీర్‌ కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ నిధులను సర్దుబాటు చేసినట్టు వివరించింది. 


Updated Date - 2020-10-24T08:48:18+05:30 IST