GST ఫైలింగ్ గడువు పొడిగింపు..!

ABN , First Publish Date - 2022-05-18T00:32:41+05:30 IST

జీఎస్‌టీ పోర్టల్‌లో కొన్ని అవాంతరాలు ఎదురవుతున్నాయని సీబీఐసీ మంగళవారం వెల్లడించింది

GST ఫైలింగ్ గడువు పొడిగింపు..!

న్యూఢిల్లీ : జీఎస్‌టీ పోర్టల్‌లో కొన్ని అవాంతరాలు ఎదురవుతున్నాయని సీబీఐసీ మంగళవారం వెల్లడించింది. ఏప్రిల్ 2022 GSTR-2B మరియు పోర్టల్‌లో GSTR-3B యొక్క ఆటో-పాపులేషన్‌లో ఇన్ఫోసిస్ సాంకేతిక లోపాన్ని  నివేదించిందని CBIC తెలిపింది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్‌లో సాంకేతిక లోపం కారణంగా ఏప్రిల్ నెలలో జీఎస్‌టీ(వస్తువులు మరియు సేవల పన్ను) దాఖలుకు గడువును పొడిగించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లుCBIC మంగళవారం తెలిపింది. దీనిని వీలైనంత త్వరగా చూసుకోవాలని ఇన్ఫోసిస్‌ను ఆదేశించింది.


GST పోర్టల్ మరియు ఆదాయపు పన్ను పోర్టల్‌  సహా ప్రభుత్వ పన్ను పోర్టల్‌లను నిర్వహించే బాధ్యత సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. సాంకేతిక బృందం GSTR-2B & సరైన ఆటో-పాపులేటెడ్ GSTR-3Bని వీలైనంత త్వరగా అందించడానికి పని చేస్తోందని ఇన్ఫోసిస్ ఓ  ట్వీట్‌లో పేర్కొంది. “ఏప్రిల్ 2022 నెలలో తమ GSTR-3Bను ఫైల్ చేయడంలో పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొనే ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుంటే, ఏప్రిల్ 2022కు  GSTR-3B ఫైల్ చేయడానికి గడువు తేదీని పొడిగించే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. పన్ను చెల్లింపుదారులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు సీబీఐసీ మరో ట్వీట్‌లో పేర్కొంది. 

Updated Date - 2022-05-18T00:32:41+05:30 IST