జీఎస్‌టీ రిటర్నుల ఫైలింగ్‌కూ అదనపు గడువు

ABN , First Publish Date - 2020-10-25T09:51:20+05:30 IST

కరోనా కష్టకాలంలో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) చెల్లింపుదారులకు సైతం ప్రభుత్వం ఊరట కల్పించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి జీఎస్‌టీ వార్షిక రిటర్నుల ఫైలింగ్‌ గడువును ఈ ఏడాది డిసెంబరు 31వరకు పొడిగిస్తున్నట్లు...

జీఎస్‌టీ రిటర్నుల ఫైలింగ్‌కూ అదనపు గడువు

కరోనా కష్టకాలంలో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) చెల్లింపుదారులకు సైతం ప్రభుత్వం ఊరట కల్పించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి జీఎస్‌టీ వార్షిక రిటర్నుల ఫైలింగ్‌ గడువును ఈ ఏడాది డిసెంబరు 31వరకు పొడిగిస్తున్నట్లు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌ (సీబీఐసీ) తెలిపింది. అంటే, వ్యాపారులకు ఇంతక్రితమే నెలరోజులు పొడిగించిన గడవుపై మరో రెండు నెలల అదనపు సమయం లభించిందన్నమాట. ఏడాదికి రూ.2 కోట్లకు పైగా టర్నోవర్‌ కలిగిన వ్యాపారులు తప్పనిసరిగా జీఎస్‌టీ వార్షిక రిటర్ను (జీఎస్‌టీఆర్‌-9/జీఎస్‌టీర్‌-9ఏ) ఫైల్‌ చేయాల్సి ఉంటుంది. రూ.5 కోట్లకు పైగా వార్షిక టర్నోవర్‌ కలిగిన వ్యాపారులు మాత్రమే రీకాన్సిలేషన్‌ స్టేట్‌మెంట్‌ (జీఎస్‌టీఆర్‌-9సీ) సమర్పించాలి.

Updated Date - 2020-10-25T09:51:20+05:30 IST