జూన్ GST వసూళ్లు... రూ. 1.37-1.39 లక్షల కోట్లుగా అంచనా

ABN , First Publish Date - 2022-07-01T02:40:52+05:30 IST

ఈ నెల(జూన్, 2022) GST వసూళ్ళు రూ. 1.37-1.39 లక్షల కోట్లుగా ఉండనున్నట్లు అంచనా.

జూన్ GST వసూళ్లు...   రూ. 1.37-1.39 లక్షల కోట్లుగా అంచనా

న్యూఢిల్లీ : ఈ నెల(జూన్, 2022) GST వసూళ్ళు రూ. 1.37-1.39 లక్షల కోట్లుగా ఉండనున్నట్లు  అంచనా. ఈ వసూళ్ళకు సంబంధించిన ఖచ్చితమైన వివరాలు రేపు(శుక్రవారం) వెలువడనున్నాయి. కాగా... నెలవారీగా వసూళ్లు మెరుగుపడతాయని ఆర్థికమంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఈ ఏడాది GST వసూళ్లు దాదాపు 1.35 లక్షల కోట్లుగా ఉండవచ్చని, నెలకు GST వసూళ్లు 1.35 లక్షల వరకు ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ ఏడాది అంచనా వేసిన 1.35 లక్షల కోట్ల GST వసూళ్లు గతేడాది 1 లక్ష కోట్ల వసూళ్లను అధిగమించే అవకాశముందని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. త్రైమాసిక వసూళ్లు సంతృప్తికరంగా ఉంటున్నాయని, రిటర్న్‌ల దాఖలును త్రైమాసికంగా లెక్కించడంతోపాటు నెలవారీ GST వసూళ్లు పెరుగుతాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది.

Updated Date - 2022-07-01T02:40:52+05:30 IST