నవంబరులో రూ. లక్ష కోట్లు దాటిన జీఎస్‌టీ వసూళ్లు

ABN , First Publish Date - 2020-12-02T00:36:33+05:30 IST

జీఎస్‌టీ కలెక్షన్లు మరోసారి రూ. లక్ష కోట్లు దాటాయి. కిందటి(నవంబరు) నెలకు గాను జీఎస్టీ వసూళ్లు రూ. 1,04,963 కోట్ల మేరకు జరిగాయి. అక్టోబరుతో పోలిస్తే స్వల్పంగా తగ్గినప్పటికీ... గతేడాది నవంబరుతో పోలిస్తే మాత్రం ఒక శాతం మేర పెరిగాయి.

నవంబరులో రూ. లక్ష కోట్లు దాటిన జీఎస్‌టీ వసూళ్లు

న్యూఢిల్లీ : జీఎస్‌టీ కలెక్షన్లు మరోసారి రూ. లక్ష కోట్లు దాటాయి. కిందటి(నవంబరు) నెలకు గాను జీఎస్టీ వసూళ్లు రూ. 1,04,963 కోట్ల మేరకు జరిగాయి.  అక్టోబరుతో పోలిస్తే స్వల్పంగా తగ్గినప్పటికీ... గతేడాది నవంబరుతో పోలిస్తే మాత్రం ఒక శాతం మేర పెరిగాయి. అక్టోబరులో జీఎస్టీ వసూళ్లు రూ. 1.05 కోట్లు దాటాయి. గతేడాది నవంబరులో రూ. 1,03,491 కోట్లు. 


వరుసగా రూ. లక్ష కోట్ల పైబడి...

నవంబరు వసూళ్లలో సీజీఎస్టీ కింద రూ. 19,189 కోట్లు, ఎస్‌జీఎస్టీ కింద రూ. 25,540 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ. 51,992 కోట్లు వసూలయ్యాయి. ఇందులో దిగుమతులపై పన్ను ద్వారా రూ. 22,078 కోట్లు ఉంది. సెస్ కింద రూ. 8,242 కోట్లు సమకూరాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది నెలలు జీఎస్టీ వసూళ్లు రూ. లక్ష కోట్లు దాటాయి. ఈ ఏడాది కరోనా, లాక్‌డౌన్ తదితర పరిణామాల నేపధ్యంలోవసూళ్లు భారీగా క్షీణించాయి. అయితే అక్టోబరు, నవంబరు నెలల్లో వసూళ్లు రూ. లక్ష కోట్లు దాటడం గమనార్హం.


82 లక్షల జీఎస్టీఆర్ 3బీ రిటర్న్‌లు... 

నవంబరులో 82 లక్షల జీఎస్టీఆర్ 3బీ రిటర్న్‌లు దాఖలయ్యాయి. నవంబరులో  ఉత్పత్తులు, దిగుమతుల నేపధ్యంలో ఆదాయం 4.9 శాతం మేర పెరిగింది. డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్(దిగుమతుల సేవలు కలిపి) ఆదాయం 0.5 శాతం పెరిగింది. 

Updated Date - 2020-12-02T00:36:33+05:30 IST