జీఎస్‌టీ వసూళ్లు రూ.97,597 కోట్లు

ABN , First Publish Date - 2020-04-02T05:37:58+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని వ్యాపార సంస్థలు మూతపడిన ప్రభావం జీఎ్‌సటీ వసూళ్లపై పడింది. మార్చిలో జీఎ్‌సటీ వసూళ్లు రూ.97,597 కోట్లుగా నమోద య్యాయి. నాలుగు నెలల్లో మొదటిసారిగా లక్ష కోట్ల

జీఎస్‌టీ వసూళ్లు రూ.97,597 కోట్లు

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని వ్యాపార సంస్థలు మూతపడిన ప్రభావం జీఎస్‌టీ వసూళ్లపై పడింది. మార్చిలో జీఎస్‌టీ వసూళ్లు రూ.97,597 కోట్లుగా నమోద య్యాయి. నాలుగు నెలల్లో మొదటిసారిగా లక్ష కోట్ల రూపాయలకన్నా తక్కువగా జీఎస్‌టీ వసూళ్లు జరిగాయి. గత ఏడాది మార్చిలో జీఎ్‌సటీ వసూళ్లు రూ.1.06 లక్షల కోట్లుగా ఉన్నాయి. దీంతో పోల్చితే ఈ ఏడాది మార్చిలో వసూళ్లు 8.4 శాతం తగ్గాయి. మార్చిలో స్థూలంగా ఉన్న రూ.97,597 కోట్ల జీఎస్‌టీ వసూళ్లలో సీజీఎస్‌టీ రూ.19,183 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ రూ.25,601 కోట్లు, ఐజీఎస్‌టీ రూ.44,508 కోట్లు (దిగుమతుల ద్వారా వసూలైన మొత్తం రూ.18,056 కోట్లు సహా), సెస్‌ రూ.8,306 కోట్లు (దిగుమతులపై వసూలు చేసిన మొత్తం రూ.841 కోట్లు సహా) ఉన్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.  దేశీయంగా లావాదేవీలు తగ్గిపోవడం, దిగుమతులు తగ్గడం వంటివి రాబడులను ప్రభావితం చేశాయి. 2019 నవంబరు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు జీఎస్‌టీ వసూళ్లు రూ.లక్ష కోట్లకు పైగానే నమోదవుతూ వచ్చాయి. 

Updated Date - 2020-04-02T05:37:58+05:30 IST