GST collections : జులైలో జీఎస్టీ వసూళ్లు అదుర్స్.. ఎన్ని కోట్ల ఆదాయమో తెలుసా..

ABN , First Publish Date - 2022-08-01T23:49:02+05:30 IST

గడిచిన నెల జులై(July)లో వస్తు, సేవల పన్ను వసూళ్లు((GST Collections)) రికార్డ్ స్థాయిలో నమోదయ్యాయి.

GST collections : జులైలో జీఎస్టీ వసూళ్లు అదుర్స్.. ఎన్ని కోట్ల ఆదాయమో తెలుసా..

న్యూఢిల్లీ : గడిచిన నెల జులై(July)లో వస్తు, సేవల పన్ను వసూళ్లు (GST Collections) రికార్డ్ స్థాయిలో నమోదయ్యాయి. ఏడాదిపరంగా 28 శాతం పురోగతి(Growth) జులై ఆదాయం ఏకంగా రూ.1.49 లక్షల కోట్లుగా నమోదయ్యింది. జీఎస్టీ విధానం (GST System) అమల్లోకి వచ్చాక ఇది రెండవ గరిష్ఠ ఆదాయం కావడం విశేషం. దీంతో వరుసగా 5వ నెలలో కూడా జీఎస్టీ ఆదాయం రూ.1.4 లక్షల కోట్ల మార్క్ దాటినట్టయ్యిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ మేరకు సోమవారం డేటా విడుదల చేసింది. జులై వరకు జీఎస్టీ ఆదాయం ఏడాదిపరంగా 35 శాతం వరకూ పెరిగింది. పన్ను చెల్లింపులను మరింత సులభతరం చేస్తూ జీఎస్టీ కౌన్సిల్ (GST Council) గతంలో తీసుకున్న పలు చర్యలు ఇందుకు దోహదపడ్డాయని ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు ఆర్థిక వ్యవస్థ రికవరీ కూడా జీఎస్టీ వసూళ్లపై సానుకూల ప్రభావం చూపిందని వెల్లడించింది.


జూన్ నెలలో 74.5 మిలియన్ల ఈ-వే బిల్లులు జనరేట్ అయ్యాయని ఆర్థిక శాఖ పేర్కొంది. మే నెలలో నమోదయ్యిన 73.6 మిలియన్ల బిల్లుల కంటే జూన్ నెల బిల్లులు కాస్తంత ఎక్కువగా ఉన్నాయని డేటా స్పష్టం చేసింది. కాగా స్థూల జీఎస్టీ వసూళ్లలో సెంట్రల్ జీఎస్టీ ఆదాయం రూ.25,751 కోట్లు, స్టేట్ జీఎస్టీ రూ.32,807 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.79,518 కోట్లుగా ఉంది. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీలో వస్తు దిగుమతుల వసూళ్లు రూ.41,420 కోట్లు, సెస్ ఆదాయం రూ.10,920 కోట్లుగా ఉన్నాయి. కాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.1.68 లక్షల కోట్ల ఆదాయం జీఎస్టీ ప్రారంభమైన నాటి నుంచి అత్యధిక ఆదాయంగా ఉంది.

Updated Date - 2022-08-01T23:49:02+05:30 IST