12న నింగిలోకి జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌10

ABN , First Publish Date - 2021-08-06T07:59:19+05:30 IST

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఈ ఏడాది రెండో రాకెట్‌ ప్రయోగానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 28వ తేదీన పీఎస్‌ఎల్వీ రాకెట్‌ ద్వారా బ్రెజిల్‌ ఉపగ్రహంతోపాటు మరో 18 నానో ఉపగ్రహాలను రోదసిలోకి చేరవేసిన ఇస్రో అనంతరం కరోనా రెండో వేవ్‌ ఉధృతి నేపథ్యంలో రాకెట్‌ ప్రయోగాలకు సిద్ధం కాలేకపోయింది.

12న నింగిలోకి జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌10

శ్రీహరికోట(సూళ్లూరుపేట), ఆగస్టు 5: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఈ ఏడాది రెండో రాకెట్‌ ప్రయోగానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 28వ తేదీన పీఎస్‌ఎల్వీ రాకెట్‌ ద్వారా బ్రెజిల్‌ ఉపగ్రహంతోపాటు మరో 18 నానో ఉపగ్రహాలను రోదసిలోకి చేరవేసిన ఇస్రో అనంతరం కరోనా రెండో వేవ్‌ ఉధృతి నేపథ్యంలో రాకెట్‌ ప్రయోగాలకు సిద్ధం కాలేకపోయింది. ఈ నెల 12వ తేదీన జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌10 రాకెట్‌ను ప్రయోగించనున్నట్లు గురువారం ఇస్రో ప్రకటించింది. గతేడాది మార్చి 28వ తేదీ  జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌10 రాకెట్‌ ద్వారా మన దేశానికి అత్యంత ఆధునికమైన భూ పరిశీలన ఉపగ్రహం జియో ఇమేజింగ్‌ శాటిలైట్‌ను కక్ష్యలోకి చేరవేసేందుకు ఇస్రో సిద్ధమైంది. ఆ ప్రయోగానికి కొద్ది గంటల ముందు సాంకేతిక కారణాలతో  నిలిపివేశారు. 

Updated Date - 2021-08-06T07:59:19+05:30 IST