Advertisement
Advertisement
Abn logo
Advertisement

రాష్ట్రంలో పెరిగిపోతున్న అరాచకాలు

కాంగ్రెస్‌పార్టీ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు అంజిబాబు 


బాపట్ల: రాష్ట్రంలో నానాటికి ఆరాచకాలు పెరిగిపోతున్నాయని అయినా పాలకులు ఏమాత్రం పట్టించుకోవటంలేదని కాంగ్రెస్‌పార్టీ బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు గంటా అంజిబాబు విమర్శించారు. పట్టణంలో ఆదివారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్యాయాలు, అక్రమాలు, హత్యాచారాలు, లైంగికవేధింపులు జరుగుతుంటే రాష్ట్రప్రభుత్వం ఏమి చేస్తుందని ప్రశ్నించారు. ఒక దళిత స్ర్తీ హోంమినిస్టర్‌గా ఉన్నప్పటికి దళితులను వేధిస్తుంటే ఏవిధమైన చర్యలు చేపట్టకపోవటం దారుణమన్నారు. ఇకనైనా దళితులపట్ల శ్రద్దచూపించి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆలిండియా కాంగ్రెస్‌పార్టీ పిలుపుమేరకు కాంగ్రెస్‌ రాష్ర్టాధ్యక్షుడు శైలజనాఽథ్‌ ఆధ్వర్యంలో విద్యుత్‌ఛార్జీలు, ఫెట్రోలు, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు నిరసనగా కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు. ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దోనేపూడి దేవరాజు, నాయకులు కట్టా లాజరస్‌, శీలం సాగర్‌బాబు, గడ్డం ఇస్సాకు, దోనేపూడి రవి, షేక్‌. ఆలిం, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement