Teesta Setalvad అరెస్టును నిరసిస్తూ.. ప్రకటన విడుదల చేసిన కేరళ రచయితలు, సాంస్కృతిక నాయకులు

ABN , First Publish Date - 2022-07-26T01:37:03+05:30 IST

గుజరాత్ అల్లర్ల కేసులకు సంబంధించి మానవ హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్, మాజీ డీజీపీ ఆర్‌బీ శ్రీకుమార్‌ల

Teesta Setalvad అరెస్టును నిరసిస్తూ.. ప్రకటన విడుదల చేసిన కేరళ రచయితలు, సాంస్కృతిక నాయకులు

తిరువనంతపురం: గుజరాత్ అల్లర్ల కేసులకు సంబంధించి మానవ హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్, మాజీ డీజీపీ ఆర్‌బీ శ్రీకుమార్‌ల అరెస్టుపై కేరళ రచయితలు, సినిమా నిపుణులు, సాంస్కృతిక నాయకుల బృందం నిరసన వ్యక్తం చేసింది. 


అదూర్‌ గోపాలకృష్ణన్‌, కె సచ్చిదానందన్‌, ఎం ముకుందన్‌, కె. వేణు, సారా జోసెఫ్‌ తదితరులు ఓ ప్రకటన విడుదల చేస్తూ.. సుప్రీంకోర్టు పరిశీలనల ముసుగులో సెతల్వాద్, శ్రీకుమార్‌లను కేంద్రం జైలుకు పంపిందని ఆరోపించారు. గుజరాత్‌లో శాంతి, మత సామరస్యాన్ని నిర్ధారించే లక్ష్యంతో సెతల్వాద్ వివిధ కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నారని పేర్కొన్నారు. పద్మ అవార్డు గ్రహీత అయిన సెతల్వాద్.. గుజరాత్ అల్లర్ల బాధితుల పునరావాసం కల్పించడంతోపాటు వారికి న్యాయం జరిగేలా పోరాటాలు చేయడంలో నిమగ్నమై ఉన్నారని తెలిపారు. 

 

సెతల్వాద్, శ్రీకుమార్‌ల అరెస్టు వెనక అసమ్మతి స్వరాలను, పౌర హక్కులను అణచివేయాలన్న ఎజెండా ఉందని ఆరోపించారు. లౌకిక, ప్రజాస్వామ్య విలువలను విశ్వసించే వారందరూ ప్రబలంగా ఉన్న అప్రకటిత అత్యవసర పరిస్థితి, నిరంకుశ వ్యవస్థకు వ్యతిరేకంగా నిరసన తెలపాలని వారు ఆ ప్రకటనలో కోరారు.

Updated Date - 2022-07-26T01:37:03+05:30 IST