గ్రూప్ 1 (2018) తుది ఫలితాలు విడుదల

ABN , First Publish Date - 2022-07-06T00:33:42+05:30 IST

Vijayawada: గ్రూప్ 1 (2018) తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఎపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ విజయవాడలో ఫలితాలను విడుదల చేశారు. 167 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఎపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

గ్రూప్ 1 (2018) తుది ఫలితాలు విడుదల

Vijayawada:  గ్రూప్ 1 (2018) తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఎపీపీఎస్సీ  చైర్మన్ గౌతమ్ సవాంగ్ విజయవాడలో ఫలితాలను విడుదల చేశారు. 167 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఎపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన వారిలో 67 మంది మహిళా అభ్యర్థులు, 96 మంది పురుష అభ్యర్థులు ఉన్నారు. వివిధ కారణాలతో  4 పోస్టులను భర్తీ చేయలేదు. డిప్యూటీ కలెక్టర్ల పోస్టులకు ఎంపికై మొదటి మూడు స్థానాల్లో నిలిచిన అభ్యర్థుల వివరాలను ఎపీపీఎస్సీ వెల్లడించింది. మొదటి స్థానంలో తూర్పు గౌదావరి జిల్లా పిఠాపురానికి చెందిన రాణి సుస్మిత,  రెండో స్థానంలో  వైఎస్ఆర్ జిల్లా కొతులగుట్టపల్లికి చెందిన కె.శ్రీనివాసరాజు, మూడో స్థానంలో హైదరాబాద్‌కు చెందిన సంజన సింహ నిలిచారు.


ఈ సందర్భంగా గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ...

‘‘అభ్యర్థులు నాలుగేళ్లుగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 2020లో జరిగిన మెయిన్స్‌లో 9,679 మంది పాల్గొన్నారు. డిజిటల్ విధానంలో వాల్యువేషన్ చేసి ఏప్రిల్ 28, 2021న ఫలితాలు విడుదల చేశాం. హైకోర్టు ఆదేశాల మేరకు మళ్లీ ఈ ఏడాది మాన్యువల్‌గా వాల్యు వేషన్ చేసి మే లో ఫలితాలు వెల్లడించాం. 165 గ్రూప్ - 1 పోస్టుల భర్తీ కోసం ఇంటర్వ్యూలు  పారదర్శకంగా నిర్వహించాం. హైకోర్టు ఆదేశాల మేరకు తుది ఫలితాలు విడుదల చేస్తున్నాం. ఫలితాలను ఎపీపీఎస్సీ వెబ్‌సైట్లో చూడవచ్చు. 


ఆగస్టులో మరో ప్రకటన

వచ్చే నెలలో గ్రూప్1, గ్రూప్ 2 ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేస్తాం.  110 పోస్టులతో  గ్రూప్ 1, 182 పోస్టులతో గ్రూప్ 2 ప్రకటన విడుదల చేస్తాం. జూలై 24న దేవాదాయ శాఖలో ఈవో పోస్టులకు, జూలై 31 న రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రాత పరీక్ష ఉంటుంది. డిజిటల్ వాల్యువేషన్‌పై న్యాయస్థానంలోనూ విచారణ జరిగింది. టెక్నాలజీ వినియోగంతో రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు వస్తాయి. 

Updated Date - 2022-07-06T00:33:42+05:30 IST