మాకు ధనం వద్దు... లక్ష్మే కావాలంటూ వరుని తండ్రి...

ABN , First Publish Date - 2021-02-24T17:22:23+05:30 IST

రాజస్థాన్‌లోని బూందీ జిల్లాలో పురాతన ఆచారాలకు...

మాకు ధనం వద్దు... లక్ష్మే కావాలంటూ వరుని తండ్రి...

బూందీ: రాజస్థాన్‌లోని బూందీ జిల్లాలో పురాతన ఆచారాలకు విరుద్ధంగా చోటుచేసుకున్న ఒక ఆదర్శప్రాయమైన ఉదంతం చర్చనీయాంశంగా మారింది. రిటైర్డ్ ప్రిన్సిపాల్ బ్రజ్ మోహన్ మీణా టోంకా జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన యువతితో తన కుమారునికి వివాహం నిశ్చయించారు. 


ఈ నేపధ్యంలో వారి వివాహ తంతు జరుగుతోంది. ఇంతలో వరుని తండ్రి నోట్లకట్టలు ఉన్న ఒక పాత్రను తీసుకు వచ్చి, అందరికీ చూపిస్తూ, ఈ డబ్బులు తమకు అక్కర్లేదని, కేవలం అమ్మాయి మాత్రమే చాలని అంటూ తమకు కట్నంగా ఆడపెళ్లివారు ఇచ్చిన రూ. 11 లక్షలను తిరిగి వారికి ఇచ్చేశారు. అయితే సంప్రదాయం ప్రకారం 101 రూపాయలు మాత్రం తన దగ్గర ఉంచుకున్నారు. ఈ సందర్భంగా వధువు ఆరతీ మీణా ఆనందం వ్యక్తం చేస్తూ, తాము ఇచ్చిన కట్నాన్ని తిరిగి ఇచ్చేసి మంచి సందేశాన్ని ఇచ్చారన్నారు. సమాజంలో మగువకు తగిన గౌరవం అందించారన్నారు. కాగా ఆరతి బీఎస్సీ పూర్తి చేసి బీఈడీ చేస్తున్నారు.

Updated Date - 2021-02-24T17:22:23+05:30 IST