పెళ్లి సమయంలో కూడా ల్యాప్‌టాప్‌తో పని చేస్తున్న వరుడిని చూసి వధువు షాకింగ్ రియాక్షన్..!

ABN , First Publish Date - 2021-07-27T16:30:44+05:30 IST

కరోనా మహమ్మారి తర్వాత మానవ జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి.

పెళ్లి సమయంలో కూడా ల్యాప్‌టాప్‌తో పని చేస్తున్న వరుడిని చూసి వధువు షాకింగ్ రియాక్షన్..!

కరోనా మహమ్మారి తర్వాత మానవ జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఇంటి నుంచే పని చేయడం ప్రారంభించారు. దాదాపు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులందరూ `వర్క్ ఫ్రమ్ హోమ్` చేస్తున్నారు. అయితే ఓ వ్యక్తి `వర్క్ ఫ్రమ్ వెడ్డింగ్` చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. పెళ్లి వేదిక వద్ద కూడా ల్యాప్‌టాప్‌లో పని చేసుకుంటూ కనిపించాడు. వరుడి పరిస్థితి చూసి అక్కడే ఉన్న వధువు పగలబడి నవ్వింది. 


ఆ దృశ్యాన్ని వీడియో తీసిన వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వరుడు ఒకవైపు పెళ్లి తంతు నిర్వహిస్తూనే మరోవైపు ల్యాప్‌టాప్‌తో కుస్తీలు పడుతున్నాడు. అక్కడే ఉన్న వధువు, బంధువులు అందరూ ఆ దృశ్యాన్ని చూసి నవ్వుతున్నారు. ఈ వీడియో ఇప్పటికే పది లక్షలకు పైగా వ్యూస్ దక్కించుకుంది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. 



Updated Date - 2021-07-27T16:30:44+05:30 IST