Viral Video: వరుడు చేసిన పనికి వధువు షాక్.. ఎంత డబ్బుంటే మాత్రం ఇదేం పని బ్రదర్ అంటున్న నెటిజన్లు!

ABN , First Publish Date - 2022-06-06T23:53:59+05:30 IST

వివాహం.. ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధుర ఘట్టం. ఈ వేడుక ద్వారా యువతి, యువకులు తమ జీవితాల్లో నూతన ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న ఈ కార్యక్రమాన్ని నేటి యువత.. మధురాతి మధురంగా మార్చుకు

Viral Video: వరుడు చేసిన పనికి వధువు షాక్.. ఎంత డబ్బుంటే మాత్రం ఇదేం పని బ్రదర్ అంటున్న నెటిజన్లు!

ఇంటర్నెట్ డెస్క్: వివాహం.. ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధుర ఘట్టం. ఈ వేడుక ద్వారా యువతి, యువకులు తమ జీవితాల్లో నూతన ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న ఈ కార్యక్రమాన్ని నేటి యువత.. మధురాతి మధురంగా మార్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కోవకే చెందిన ఓ వరుడు.. పట్టరాని సంతోషంతో చేసిన ఓ పని ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అది చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కాగా.. ఇంతకూ విషయం ఏంటంటే..



యువతి, యువకుడు ఒకరికొకరు నచ్చడంతో వారికి పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. పెళ్లి ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసి, ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో అతిథులు, బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా వివాహ వేడుక ముగిసింది. వేడుకకు హాజరైన వారితో ఫొటోలు దిగేందుకు వధువు, వరుడు.. అక్కడ ఏర్పాటు చేసిన వేదిక మీదకు వెళ్లారు. సరిగ్గా అదే సమయంలో.. డీజే పాటలు ప్రారంభం అయ్యాయి. దీంతో వరుడు పట్టరాని సంతోషంతో స్టెప్పులేశాడు. ఈ క్రమంలోనే తన జేబులోంచి కొంత డబ్బును తీసి, వధువుపై చల్లాడు. అతడు చేసిన పనికి వధువు ఒక్కసారిగా షాకైంది. కొందరు ఈ దృశ్యాలను వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. దీంతో స్పందిస్తున్న నెటిజన్లు.. రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘డబ్బులు ఎంత ఎక్కువైతే మాత్రం ఇలా చేయాడం ఏంటి బ్రదర్’ అని కొందరు కామెంట్ చేస్తే.. ‘నీ సంతోషాన్ని వ్యక్త పర్చడానికి అది సరైన పద్ధతి కాదు’ అంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. 




Updated Date - 2022-06-06T23:53:59+05:30 IST