ఒకరినొకరు ఇష్టపడ్డారు.. పెళ్లి చేసుకునేందుకు ఆర్నెళ్ల క్రితమే రిజిస్టర్ చేయించుకున్నారు.. తీరా ముహూర్తం సమయానికి వరుడు ట్విస్ట్..

ABN , First Publish Date - 2021-12-12T20:37:07+05:30 IST

యువతి, యువకుడు ఒకరినొకరు ఇష్టపడ్డారు. దీంతో వారికి పెళ్లి చేయాలని ఇరు కుటుంబ సభ్యులు నిశ్చయించుకున్నారు. ముహూర్తం కూడా ఖరారు చేశారు. ఈ క్రమంలో సరిగ్గా ముహూర్తం సమయానికి పెళ్లి కుమారుడు ట్విస్ట్ ఇవ్వడంతో అందరూ ఒ

ఒకరినొకరు ఇష్టపడ్డారు.. పెళ్లి చేసుకునేందుకు ఆర్నెళ్ల క్రితమే రిజిస్టర్ చేయించుకున్నారు.. తీరా ముహూర్తం సమయానికి వరుడు ట్విస్ట్..

ఇంటర్నెట్ డెస్క్: యువతి, యువకుడు ఒకరినొకరు ఇష్టపడ్డారు. దీంతో వారికి పెళ్లి చేయాలని ఇరు కుటుంబ సభ్యులు నిశ్చయించుకున్నారు. ముహూర్తం కూడా ఖరారు చేశారు. ఈ క్రమంలో సరిగ్గా ముహూర్తం సమయానికి పెళ్లి కుమారుడు ట్విస్ట్ ఇవ్వడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. 


ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీ ప్రాంతానికి చెందిన యువతి, యువకుడు ఒకరినొకరు ఇష్టపడటంతో వారికి పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అయితే ఆర్థిక కారణాల వల్ల.. స్థానిక మంత్రి ఏర్పాటు చేసిన సామూహిక వివాహా కార్యక్రమంలో పెళ్లి చేయాలని అనుకున్నారు. అందుకోసం ఆర్నెళ్ల ముందే రిజిస్టర్ కూడా చేయించారు. దీంతో శనివారం రోజు ముహూర్తం సమయానికి వధువు ముస్తాబై.. పెళ్లి మండపం వద్దకు చేరుకుంది. అయితే సమయం మించిపోతున్నా.. వరుడు అక్కడకు రాకపోవడంతో నిర్వహకులు పలుమార్లు మైక్‌లో పిలిచారు. అయినా ఫలితం లేకపోవడంతో.. వరుడు కోసం వధువు, ఆమె కుటుంబ సభ్యులకు పడిగాపులు తప్పలేదు. చివరకు వరుడు పారిపోయినట్టు తెలుసుకుని.. వారు షాకయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ స్థానికంగా చర్చనీయాంశం అయింది. ఇదిలా ఉంటే.. స్థానిక మంత్రి సురేష్ పాసీ నిర్వహించిన ఈ సామూహిక వివాహ వేడుకలో 40 జంటలు పెళ్లి బంధంతో ఒక్కటయ్యాయి.




Updated Date - 2021-12-12T20:37:07+05:30 IST