కారు, హెలికాఫ్టర్లలో వరుడు రావడం చూసి ఉంటారు.. చివరకు ఎద్దులబండిలో వచ్చినోళ్లు కూడా ఉన్నారు.. కానీ ఇతడు మాత్రం.. వెరైటీగా..

ABN , First Publish Date - 2022-06-23T17:35:57+05:30 IST

కారు, హెలికాప్టర్ వంటి వాహనాల్లో వరుడు పెళ్లి మంటపానికి చేరుకోవడం పాత పద్ధతి. కొద్ది రోజుల క్రితం ఓ వరుడు కాస్త వెరైటీగా ఎద్దులబండిలో కూడా చేరుకున్నాడు. కానీ తాజాగా ఓ వ్యక్తి మాత్రం ఇంకాస్త కొత్తదనాన్ని కోరుకున్నాడు. ఎవ్వరూ ఊహించని

కారు, హెలికాఫ్టర్లలో వరుడు రావడం చూసి ఉంటారు.. చివరకు ఎద్దులబండిలో వచ్చినోళ్లు కూడా ఉన్నారు.. కానీ ఇతడు మాత్రం.. వెరైటీగా..

ఇంటర్నెట్ డెస్క్: కారు,  హెలికాప్టర్ వంటి వాహనాల్లో వరుడు పెళ్లి మంటపానికి చేరుకోవడం పాత పద్ధతి. కొద్ది రోజుల క్రితం ఓ వరుడు కాస్త వెరైటీగా ఎద్దులబండిలో కూడా చేరుకున్నాడు. కానీ తాజాగా ఓ వ్యక్తి మాత్రం ఇంకాస్త కొత్తదనాన్ని కోరుకున్నాడు. ఎవ్వరూ ఊహించని రీతిలో వధువు ఇంటికి వెళ్లి అందరికీ షాకిచ్చాడు. దీంతో ప్రస్తుతం ఆ వరుడికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



మధ్యప్రదేశ్‌కు చెందిన అంకుష్ జైశ్వాల్ టాటా కన్సల్టెన్సీ సంస్థలో సివిల్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. పధార్ ప్రాంతానికి చెందిన స్వాతి అనే అమ్మాయితో అతడికి పెళ్లి నిశ్చయమైంది. బుధవారం పెళ్లి ముహూర్తం ఉండటంతో వధువు ఇంటికి చేరుకోవడానికి వరుడి కుటుంబ సభ్యులు కొన్ని వాహనాలను ఏర్పాటు చేశారు. వరుడి కోసం ప్రత్యేకంగా గుర్రాన్ని తెప్పించారు. అయితే.. అంకుష్ మాత్రం.. చివరి నిమిషంలో అతడి కుటుంబ సభ్యులకు షాకిచ్చాడు. గుర్రంపై పెళ్లి మంటపానికి చేరుకోవడానికి నిరాకరించాడు. తాను సివిల్ ఇంజినీర్ కాబట్టి.. జేసీబీపై వివాహ వేదిక వద్దకు వస్తానని స్పష్టం చేశాడు. దీంతో చేసేదేమీ లేక.. వరుడి కుటుంబ సభ్యులు ఓ జేసీబీని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వరుడు జేసీబీపై కూర్చుని వధువు ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన వివాహ వేదిక వద్దకు చేరుకున్నాడు. వరుడి రాకను చూసి.. వధువు తరఫు బంధువులు ఆశ్చర్యపోయారు. వరుడికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారడంతో.. నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘ఎంత సివిల్ ఇంజినీర్‌వి అయితే మాత్రం.. జేసీబీపై వెళ్లడం ఏంటి బ్రదర్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 


Updated Date - 2022-06-23T17:35:57+05:30 IST