Viral Video: అనూహ్య ఘటనతో వధువు షాక్.. అందరి ముందే వరుడు అలా ప్రవర్తించడంతో..

ABN , First Publish Date - 2022-06-24T16:33:09+05:30 IST

వివాహ వేడుక అంటేనే సరదాలు, సంతోషాలకు కేరాఫ్ అడ్రస్. స్నేహితులు, బంధువులు వల్ల వేడుక సందడిగా మారుతుంది. కాగా.. తాజాగా జరిగిన ఓ వివాహ వేడుకలో వరుడు.. వధువు సహా పెళ్లికి హాజరైన వారందరికీ షాకిచ్చాడు. దీంతో అందరి ముఖాల్లో చిరు

Viral Video: అనూహ్య ఘటనతో వధువు షాక్.. అందరి ముందే వరుడు అలా ప్రవర్తించడంతో..

ఇంటర్నెట్ డెస్క్: వివాహ వేడుక అంటేనే సరదాలు, సంతోషాలకు కేరాఫ్ అడ్రస్. స్నేహితులు, బంధువులు వల్ల వేడుక సందడిగా మారుతుంది. కాగా.. తాజాగా జరిగిన ఓ వివాహ వేడుకలో వరుడు.. వధువు సహా పెళ్లికి హాజరైన వారందరికీ షాకిచ్చాడు. దీంతో అందరి ముఖాల్లో చిరునవ్వు మాయమైంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 


యువతి, యువకుడు ఒకరికొకరు నచ్చడంతో కుటుంబ సభ్యులు పెళ్లి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. ఈ క్రమంలోనే బంధుమిత్రులు వివాహ వేడుకకు హాజరయ్యారు. వివాహానంతరం వధువు, వరుడు ఇద్దరూ అక్కడ ఏర్పాటు చేసిన స్టేజీ మీదకు వెళ్లి ఫొటోలకు ఫోజులిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు స్నేహితులు ఇచ్చి.. వాళ్లకు ఓ ఫన్నీ గేమ్ పెట్టారు. పటిష్టంగా ప్యాక్ చేసిన గిఫ్ట్‌లను చెరొకటి ఇచ్చి.. దానిలో ఏముందో కనుక్కోవ్వాలని సూచించారు. మొదట కనుక్కున్న వాళ్లను విజేతలుగా గుర్తిస్తామన్నారు. దీంతో వరుడు, వధువు.. గేమ్ స్టార్ట్ చేశారు. ఇందులో వధువు విజయం సాధించింది. 



ఈ క్రమంలోనే ఆమె తన సంతోషం వ్యక్తం చేస్తూ.. చేతులు పైకెత్తుతుంది. అయితే ఓటమిని జీర్ణించకోలేకపోయిన వరుడు.. షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు. అందరూ చూస్తుండగానే వధువు తలపై బలంగా కొట్టాడు. ఈ అనూహ్య ఘటనకు అక్కడనున్న వాళ్లంతా నోరెళ్లబెట్టారు. కాగా.. అందరి ముందు వరుడు తనపై చేయి చేసుకోవడంతో.. వధువు స్టేజీ దిగి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు స్పందిస్తూ.. వధువుకు తమ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో వరుడుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. 




Updated Date - 2022-06-24T16:33:09+05:30 IST