పెళ్లి జరుగుతుండగా ఊడిపోయిన వరుడి విగ్గు.. పెళ్లి వద్దన్న వధువు

ABN , First Publish Date - 2022-05-24T00:23:56+05:30 IST

ఉన్నావ్‌కు సమీపంలోని రెండు గ్రామాలకు చెందిన యువతి యువకులకు పెళ్లి నిశ్చయమైంది. అయితే తనకు బట్టతల ఉందనే విషయాన్ని యువకుడు దాచి పెట్టాడు. పెళ్లి చూపులకు విగ్గుతో వచ్చాడు. పెళ్లి పీటలు ఎక్కే వరకు బాగానే మ్యానేజ్ చేశాడు. కానీ తీరా పెళ్లి తంతు జరుగుతుండగా జయమాల..

పెళ్లి జరుగుతుండగా ఊడిపోయిన వరుడి విగ్గు.. పెళ్లి వద్దన్న వధువు

లఖ్‌నవూ: వంద అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమనేది పాత సామెత. ఇప్పుడు జరుగుతున్న వివాహాల్లో ఆడుతున్న అబద్ధాలు ఎన్నో చెప్పలేం కానీ, చిన్నవో పెద్దవో ప్రతి పెళ్లిలో ఏదో ఒక అబద్ధమో అంతకు మించిన అబద్ధాలో సాధారణంగానే ఉంటాయి. పెళ్లి కోసమో కట్నం కోసమో పరువు కోసమో ఇలాంటి అబద్ధాలు ఇప్పటికి చెప్తూనే ఉన్నారు. ఇలా ఒక అబద్ధం చెప్పిన వరుడికి పెళ్లి పీటల మీదే షాక్ తలిగింది. పెళ్లి తంతు జరుగుతుండగా అసలు విషయం బయటపడి పెళ్లి ఒద్దే వద్దంటు వధువు హంగామా సృష్టించింది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో జరిగిందీ ఘటన.


ఉన్నావ్‌కు సమీపంలోని రెండు గ్రామాలకు చెందిన యువతి యువకులకు పెళ్లి నిశ్చయమైంది. అయితే తనకు బట్టతల ఉందనే విషయాన్ని యువకుడు దాచి పెట్టాడు. పెళ్లి చూపులకు విగ్గుతో వచ్చాడు. పెళ్లి పీటలు ఎక్కే వరకు బాగానే మ్యానేజ్ చేశాడు. కానీ తీరా పెళ్లి తంతు జరుగుతుండగా జయమాల వేడుక అనంతరం మండపంలోకి వరుడు రావాల్సి ఉంది. అయితే అదే సమయంలో అతడు స్పృహ తప్పి పడిపోయాడు. అతడిని లేపే ప్రయత్నంలో తలపాగా తీయగా విగ్గు ఊడిపోయింది. ఇది చూసి వధువు, ఆమె బంధువులు నిర్ఘాంతపోయారు.


బట్టతల విషయం దాచారంటూ ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. బట్టతల ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకునే సమస్యే లేదని వధువు కుండబద్దలు కొట్టేసింది. కాగా, అబద్ధాలు చెప్పి తమను మోసం చేశారని, తమను చాలా ఇబ్బంది పెట్టారని పోలీస్ స్టేషన్‌లో వరుడి కుటుంబంపై వధువు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే పెళ్లి కోసం ఇప్పటి వరకు 5.66 లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయని వధువు తండ్రి తెలుపగా.. ఆ మొత్తం ఇచ్చేందుకు వరుడి కుటుంబం ఒప్పుకుంది. కాగా, వధువు లేకుండానే వరుడి కుటుంబం పెళ్లి మండపం నుంచి వెళ్లిపోయింది.

Updated Date - 2022-05-24T00:23:56+05:30 IST