Viral Video.. పెళ్లిలో వధువు ముద్దు పెట్టగానే వరుడి రియాక్షన్ చూసి పొట్టచెక్కలయ్యేలా నవ్విన బంధువులు..

ABN , First Publish Date - 2021-08-05T19:45:41+05:30 IST

పెళ్లిలోని సరదా సంఘటనలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి..

Viral Video.. పెళ్లిలో వధువు ముద్దు పెట్టగానే వరుడి రియాక్షన్ చూసి పొట్టచెక్కలయ్యేలా నవ్విన బంధువులు..

పెళ్లిలోని సరదా సంఘటనలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.. వీటిని చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు.. దీంతో చాలా మంది అలాంటి వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.. తాజాగా ఓ క్రిస్టియన్ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.. 


ఆ వీడియోలో పెళ్లి వేడుక పూర్తయిన తర్వాత వరుడికి వధువు ముద్దు పెట్టింది. దీంతో వరుడు వెంటనే వెనక్కి పడిపోయాడు. వెనక ఉన్న అతని స్నేహితులు అతడిని పట్టుకుని నిలబెట్టారు. ముందు షాకైన వధువు అది వరుడు సరదాగా చేశాడని తెలుసుకుని చిరునవ్వులు చిందించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో ఇప్పటికే 94 వేల లైకులను దక్కించుకుంది. 




Updated Date - 2021-08-05T19:45:41+05:30 IST