పెళ్లి మండపానికి ఆలస్యంగా వచ్చిన వరుడు.. వధువు అతనికి ఎలా బుద్ధి చెప్పిందంటే..

ABN , First Publish Date - 2022-04-29T17:53:07+05:30 IST

పెళ్లి మండపానికి ఆలస్యంగా వచ్చిన వరుడికి వధువు కోలుకోలేని షాకిచ్చింది. ముహూర్త సమయానికి పీటల మీదకు రాకుండా ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకున్న వరుడుని తిరస్కరించింది.

పెళ్లి మండపానికి ఆలస్యంగా వచ్చిన వరుడు.. వధువు అతనికి ఎలా బుద్ధి చెప్పిందంటే..

పెళ్లి మండపానికి ఆలస్యంగా వచ్చిన వరుడికి వధువు కోలుకోలేని షాకిచ్చింది. ముహూర్త సమయానికి పీటల మీదకు రాకుండా ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకున్న వరుడుని తిరస్కరించింది. పెళ్లి రోజు కూడా తాగకుండా ఉండలేకపోయిన వ్యక్తితో తన జీవితాన్ని పంచుకోవడానికి భయపడి పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. పెళ్లికి వచ్చిన ఓ బంధువును వివాహం చేసుకుంది. దీంతో ఆ వరుడు షాకై ఇంటికి తిరిగి వెళ్లిపోయాడు. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా మల్కాపూర్‌ పాంగ్రా గ్రామంలో ఈ ఘటన జరిగింది.


మల్కాపూర్‌ పాంగ్రా గ్రామానికి చెందిన యువతికి కండారీ గ్రామానికి చెందిన యువకుడితో వివాహం కుదిరింది. ఈ నెల 22న వీరి పెళ్లి జరగాల్సి ఉంది. సాయంత్రం 4 గంటలను పెళ్లి ముహూర్తంగా నిర్ణయించారు. అనుకున్న సమయానికే అతిథులందరూ పెళ్లి మండపానికి చేరుకున్నారు. కానీ వరుడు మాత్రం రాలేదు.  ఆ సమయంలో వరుడు బాగా మద్యం సేవించి బంధువులు, స్నేహితులతో కలిసి డ్యాన్సులు వేస్తున్నాడు. అవన్నీ పూర్తి చేసుకుని అతను పెళ్లి మండపానికి చేరుకునేసరికి రాత్రి 8 గంటలయింది.


ముహూర్తం దాటిన తర్వాత వచ్చిన వరుడి తీరుపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిని పెళ్లి చేసుకోనని వధువు తన తండ్రికి తేల్చిచెప్పింది. కూతురు నిర్ణయాన్ని తండ్రి గౌరవించాడు. వరుడు కుటుంబ సభ్యులకు విషయం చెప్పాడు. వరుడి తరఫు వారు అమ్మాయికి ఇచ్చిన ఆభరణాలు, చీరలు వెనక్కి ఇచ్చేశాడు. పెళ్లికి వచ్చిన ఒక బంధువుతో మాట్లాడి అతడి కుమారుడితో తన కుమార్తెకు పెళ్లి చేశాడు.  

Updated Date - 2022-04-29T17:53:07+05:30 IST