తెల్లారితే పెళ్లి అనగా.. లగ్నపత్రిక తిరిగిచ్చేసి వెళ్లిన వరుడి కుటుంబం.. ఎందుకంటే?

ABN , First Publish Date - 2022-04-28T09:26:47+05:30 IST

తెల్లారితే అమ్మాయి పెళ్లి అని ఆ కుటుంబం రకరకాల ఏర్పాట్లు చేస్తోంది. బంధువులు వస్తున్నారా? లేదా? అంటూ ఫోన్లు చేసి కనుక్కుంటున్నారు. ఇలాంటి సమయంలో సడెన్‌గా వరుడి కుటుంబం ఆ ఇంటికి వచ్చింది. అక్కడ రెండు కుటుంబాల మధ్య పెద్ద గొడవ జరిగింది. దాంతో వరుడి కుటుంబం లగ్న పత్రిక తిరిగిచ్చేసి...

తెల్లారితే పెళ్లి అనగా.. లగ్నపత్రిక తిరిగిచ్చేసి వెళ్లిన వరుడి కుటుంబం.. ఎందుకంటే?

తెల్లారితే అమ్మాయి పెళ్లి అని ఆ కుటుంబం రకరకాల ఏర్పాట్లు చేస్తోంది. బంధువులు వస్తున్నారా? లేదా? అంటూ ఫోన్లు చేసి కనుక్కుంటున్నారు. ఇలాంటి సమయంలో సడెన్‌గా వరుడి కుటుంబం ఆ ఇంటికి వచ్చింది. అక్కడ రెండు కుటుంబాల మధ్య పెద్ద గొడవ జరిగింది. దాంతో వరుడి కుటుంబం లగ్న పత్రిక తిరిగిచ్చేసి.. పెళ్లి క్యాన్సిల్ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో వెలుగు చూసింది. 


స్థానికంగా నివశించే గోవింద ప్రసాద్ అనే వ్యక్తి కుమార్తెను.. లఖన్ సింహ్ కుమారుడైన సోన్‌వీర్‌కు ఇచ్చి కట్టబెట్టాలని పెద్దలు నిర్ణయించారు. ఆ తర్వాత అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ కలిసి ఉదయ్‌పూర్ తదితర ప్రాంతాలకు వెళ్లి ప్రీ-వెడ్డింగ్ షూట్ కూడా చేశారు. సరిగ్గా పెళ్లికి ఒక రోజు ముందు అమ్మాయి ఇంటికి వచ్చిన లఖన్ సింహ్ కుటుంబం.. తమకు ఇస్తామన్న కట్నం చేతుల్లో పెడితేనే పెళ్లి జరుగుతుందని తేల్చేసింది. అప్పటికప్పుడు అంత డబ్బు తీసుకురావడం కుదరదని, ముందు పెళ్లి పూర్తయితే ఆ తర్వాత డబ్బు ఇస్తానని గోవింద ప్రసాద్ అన్నాడు. ఈ క్రమంలో రెండు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. 


అంతే, తమ వద్ద ఉన్న లగ్న పత్రికను తిరిగిచ్చేసి పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటున్నామని లఖన్ సింహ్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో గోవింద ప్రసాద్ ఆ లగ్న పత్రికి తీసుకొని పోలీసులను ఆశ్రయించాడు. పెళ్లికి ముందే చాలా ఖరీదైన వస్తువులను పెళ్లికొడుకు తీసుకున్నాడని, ఇప్పుడు లగ్న పత్రికి తిరిగిచ్చేశారని, వాళ్ల ఇంటికి వెళ్తే కొందరు ఆడవాళ్లు వచ్చి కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వరకట్నం నేరం కింద లఖన్ సింహ్ సహా ఐదుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పారు.


Updated Date - 2022-04-28T09:26:47+05:30 IST