Abn logo
Oct 1 2020 @ 04:53AM

ప్రభుత్వ పథకాల గ్రౌండింగ్‌ పూర్తి చేయాలి

పంట రుణాలు రూ.1,236 కోట్లుకు గాను ఇచ్చింది రూ.326 కోట్లు మాత్రమే 

ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్‌ గ్యారంటీ ప్రోగ్రాంకు 199 దరఖాస్తులు రాగా 28 మాత్రమే గ్రౌండింగ్‌

బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు


కలెక్టరేట్‌, సెప్టెంబరు 30: బ్యాంకుల సహకారంతో అమలు చేసే వివిధ ప్రభుత్వ పథకాల గ్రౌండింగ్‌ను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు బ్యాంక్‌ కో-ఆర్డినేటర్లను కోరారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వెబ్‌ ఎక్స్‌ వీడియో కాన్ఫ్‌రెన్స్‌ ద్వారా బ్యాంకర్ల సంప్రదింపుల సలహా కమిటీ సమావేశంలో మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల సహకారంతో పంట రుణాల కింద రూ.1,236 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.326 కోట్లు మాత్రమే ఇచ్చారని అన్నారు. రుణాల పంపిణీని వేగవంతం చేయాలని చెప్పారు. పరిశ్రమల శాఖ ద్వారా అమలు చేసే ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్‌ గ్యారంటీ ప్రోగ్రాం కింద గత సంవత్సరం లక్ష్యం సాధించగా, ఈ ఏడాది 199 దరఖాస్తులకు గాను బ్యాంకులు కేవలం 28 మాత్రమే గ్రౌండింగ్‌ చేశా యన్నారు. మిగతా దరఖాస్తులు బ్యాంకుల వద్ద ఉన్నాయని తెలుసుకున్న కలెక్టర్‌ ఆయా బ్యాంకుల రీజినల్‌ మేనేజర్లతో మాట్లాడుతూ రుణాలిచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.


ఆత్మ నిర్బర్‌ పథకం కింద రుణాల పంపిణీని సెప్టెంబర్‌ 30 నాటికి పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఈ విష యంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, ఎంఎ్‌సఎం మంత్రి తరచుగా సమీక్షలు జరుపుతున్నారని తెలిపారు. మమబూ బ్‌నగర్‌ మునిసిపాలిటీలో 6,000 దరఖాస్తులు రాగా, ఇప్పటివరకు 2,092 యూనిట్లు గౌండింగ్‌ చేశారన్నారు. జడ్చర్ల మునిసిపాలిటీలో 2,624కు 453, భూత్పూర్‌లో 669కి 152 మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ పది రోజుల్లో మిగిలిన దరఖాస్తులకు రుణాలు మంజూరు ఇవ్వాలని సూచించారు. ఈ విశయంపై త్వరలో బ్యాంకర్లతో సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే రుణాలపై ప్రత్యేక దృష్టి సారించి, వేగవంతం చేయాలన్నారు. 


కార్పొరేషన్‌ రుణాలు క్లియర్‌ చేయాలి

ఎస్సీ కార్పొరేషన్‌ రుణాల పెండింగ్‌లను త్వరగా క్లియర్‌ చేయాలని కలెక్టర్‌ చెప్పారు. బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖల ద్వారా అమలు చేస్తున్న యూనిట్లపై సమీక్షించారు. మత్స్య శాఖను సమీక్షిస్తూ ఇప్పటి వరకు 74 చెరువులలో 12 లక్షల చేప పిల్లలను వదలడం జరిగిందన్నారు. జిల్లాలో మత్స్య ఉత్పత్తి ఎక్కువగా ఉన్నందున మత్స్యకారులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు మందుకు రావాలని సూచించారు. ఇప్పటి వరకు 1,020 మంది దరఖాస్తులు చేసుకున్నారని కలెక్టర్‌ తెలిపారు. పాడి పరిశ్రమ అభివృద్ధి కింద 2,999 దరఖాస్తులు వచ్చాయని, వ్యవసాయ రంగానికి అనుసంధానంగా ఉన్న ఈ పరిశ్రమను కూడా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అధికారులు, బ్యాంకర్లపై ఉందన్నారు. ఇప్పటి వరకు ఇచ్చిన రుణాల వివరాల రిపోర్టు తనకు ఇవ్వాలన్నారు. ఉద్యాన, పట్టు పరిశ్రమ రంగాల అభివృద్ధికి బ్యాంకర్లు సహకరించాలని కోరారు. సమావేశంలో ఎల్‌డీఎం నాగరాజు, ఆయా బ్యాంకల అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్లు, రీజినల్‌ మేనేజర్లు, బ్యాంకుల కంట్రోలర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement