ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-08-09T05:37:43+05:30 IST

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్‌

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్‌

వరంగల్‌ కలెక్టరేట్‌, ఆగస్టు 8: ప్రజావాణిలో ప్రజలు ఇచ్చిన దర ఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా అధికారులు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌ బి.గోపి ఆదేశించా రు. సోమవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరిగిన గ్రీవెన్స్‌ సెల్‌లో 57 దరఖాస్తులు రాగా, వాటిని  సంబంధిత శాఖలకు అందజేశారు. కలెక్టర్‌ మాట్లా డుతూ జిల్లా అభివృద్ధిలో ముందుకు పోవడానికి జిల్లా అధికారులు కృషి చేయా లన్నారు. క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాల పనితీరును పరిశీలించి ప్రజల సమస్య లను పరిష్కరించాలన్నారు. ప్రతీ వారం భూ సమస్యలపైనే అధికంగా వినతి పత్రాలు వస్తున్నాయి. జిల్లాలోని అన్ని మండలాల్లో ధరణికి సంబంధించిన సమస్య లతో ఇబ్బందులు పడుతున్న వారు కలెక్టర్‌ కార్యాలయం చుట్టూ సమస్యలు పరి ష్కారం కోసం తిరుగుతున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి.హరిసింగ్‌, కె.శ్రీవత్స, ఆర్‌డీవో మహేందర్‌జీ, అధికారులు పాల్గొన్నారు.

- ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో సమస్యలను పరిష్కరించి, పెరిగిన ధరలకు అనుగు ణంగా మెస్‌ చార్జీలు పెంచాలని జిల్లా పీడీఎస్‌యూ, ఏబీఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. హాస్టళ్లలో సమస్యలు పేరుకుపోయాయని, తక్షణమే పరిష్కరించాలని కోరారు. 

-  సీకేఎం మెటర్నరీ ఆస్పత్రిలో 20ఏళ్లుగా వివిధ విభాగాల్లో దినసరి వేతనంగా త క్కువ వేతనంతో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని ప్రభుత్వం ఔట్‌ సోర్సింగ్‌ కార్మి కులుగా గుర్తించి వేతనాలు పెంచాలని కోరారు. సీకేఎం ఆస్పత్రిలో విధులు నిర్వహి స్తున్న ప్రతిభ సోషల్‌ వెల్ఫేర్‌ సొసైటీ చెందిన 25మంది కార్మికులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.



Updated Date - 2022-08-09T05:37:43+05:30 IST