కశ్మీరులో పోలీసు వాహనంపై గ్రెనెడ్ దాడి

ABN , First Publish Date - 2020-10-23T15:35:08+05:30 IST

ఓ అనుమానిత ఉగ్రవాది పోలీసు వాహనంపై గ్రెనెడ్ విసిరిన ఘటన ....

కశ్మీరులో పోలీసు వాహనంపై గ్రెనెడ్  దాడి

పూంచ్  (జమ్మూకశ్మీరు): ఓ అనుమానిత ఉగ్రవాది పోలీసు వాహనంపై గ్రెనెడ్ విసిరిన ఘటన జమ్మూకశ్మీరులోని పూంచ్ జిల్లా కాలియా ప్రాంతంలో వెలుగుచూసింది. కాలియా వంతెన ప్రాంతంలో గురువారం రాత్రి పోలీసు వాహనం వెళుతుండగా దానిపై అనుమానిత ఉగ్రవాది గ్రెనెడ్ విసిరాడు. అయితే ఆ గ్రెనెడ్ పేలక పోవడంతో పోలీసులకు పెద్ద ప్రమాదం తప్పింది. గ్రెనెడ్ దాడితో పూంచ్ జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పాకిస్థాన్ నుంచి సరిహద్దు జిల్లాలైన పూంచ్, రాజౌరీ ప్రాంత గ్రామాలకు ఆయుధాలు, మాదకద్రవ్యాలను తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. ఉగ్రవాద స్లీపర్ సెల్స్ కు ఆయుధాలు చేరవేస్తున్నారనే సమాచారం మేర భద్రతా బలగాలతో తనిఖీలు జరిపారు. గ్రెనెడ్ దాడి అనంతరం ఉగ్రవాదుల కోసం గాలింపును ముమ్మరం చేశారు.

Updated Date - 2020-10-23T15:35:08+05:30 IST