అంతా ద్రావిడ్‌ వల్లే ..

ABN , First Publish Date - 2021-05-13T05:57:06+05:30 IST

ఆస్ట్రేలియా క్రికెట్‌ నిర్మాణాన్ని అవగతం చేసుకొన్న రాహుల్‌ ద్రావిడ్‌.. భారత్‌లో యువ ప్రతిభను వెలికి తీయడానికి ఆసీస్‌ కంటే మెరుగైన విధానాన్ని రూపొందించాడని ఆ దేశ మాజీ ఆటగాడు గ్రెగ్‌ చాపెల్‌ ప్రశంసించాడు...

అంతా ద్రావిడ్‌ వల్లే ..

  • టీమిండియా బెంచ్‌ బలంపై గ్రెగ్‌చాపెల్‌


సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెట్‌ నిర్మాణాన్ని అవగతం చేసుకొన్న రాహుల్‌ ద్రావిడ్‌.. భారత్‌లో యువ ప్రతిభను వెలికి తీయడానికి ఆసీస్‌ కంటే మెరుగైన విధానాన్ని  రూపొందించాడని ఆ దేశ మాజీ ఆటగాడు గ్రెగ్‌ చాపెల్‌ ప్రశంసించాడు. ఆస్ట్రేలియాలో ఇలాంటి విధానమే కరువైందని విమర్శించాడు. యువ ప్రతిభను వెతికిపట్టి వారి ఎదుగుదలకు తగిన వేదికలను అందించడంలో భారత్‌, ఇంగ్లండ్‌లు ఆసీ్‌సను వెనక్కు నెట్టాయన్నాడు. ‘యువకులతో కూడిన టీమిండియా ఇవాళ అద్భుతంగా ఆడగలుగుతోందంటే అదంతా ద్రావిడ్‌ వల్లే. ఆస్ట్రేలియన్ల ఆలోచనలను రాహుల్‌ బాగా చదివాడు. వాటిని అమలు చేశాడు. దీంతో టీమిండియాకు బలమైన బెంచ్‌ తయారైంది’ అని చాపెల్‌ తెలిపాడు. ‘అత్యుత్తమ యువ ప్రతిభను కనుగొనే చరిత్ర ఆస్ట్రేలియా క్రికెట్‌కు ఉంది. కానీ, కొన్నేళ్లుగా జట్టులో అంతా మారిపోయింది. సత్తా ఉన్న కొందరు యువ ఆటగాళ్ల పరిస్థితి అయోమయంగా తయారైంది’ అని గ్రెగ్‌ అన్నాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్‌ సిరీ్‌సలో యువ భారత్‌ అద్భుత విజయాన్ని సొంతం చేసుకొంది. ‘ఈ సిరీస్‌ గెలుపు భారత్‌లో ఆటగాళ్లను తీర్చిదిద్దే వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందనే దానికి నిలువుటద్దం’ అని చాపెల్‌ చెప్పాడు. 


Updated Date - 2021-05-13T05:57:06+05:30 IST