సేవకుడికి సలామ్‌!

ABN , First Publish Date - 2021-09-29T06:02:33+05:30 IST

ఆయన తల్లి కేన్సర్‌తో బాధపడుతోంది. వైద్యానికి అయ్యే ఖర్చు, ఆమె అ నుభవించే నరకం అతను కళ్లారా చూశాడు. అదే మహమ్మారి రెండేళ్ల చిన్నారిని కూడా కబళిస్తుం దని తెలుసుకొని చలించిపోయాడు.

సేవకుడికి సలామ్‌!
టీషర్ట్‌పై ఉన్న బాధిత చిన్నారిని చూపుతున్న సేవకుడు

చిన్నారి కేన్సర్‌ చికిత్స కోసం సైకిల్‌ యాత్ర

చెన్నై నుంచి లడక్‌ వరకూ ప్రయాణం

ఆర్థికసాయం చేయించడమే ధ్యేయం


అద్దంకి, సెప్టెంబరు 28 : ఆయన తల్లి కేన్సర్‌తో బాధపడుతోంది. వైద్యానికి అయ్యే ఖర్చు, ఆమె అ నుభవించే నరకం అతను కళ్లారా చూశాడు. అదే మహమ్మారి రెండేళ్ల చిన్నారిని కూడా కబళిస్తుం దని తెలుసుకొని చలించిపోయాడు. ఆ బాలిక వై ద్యానికి అవసరమైన ఆర్థికసాయం అందించేలా ప్ర జల్లో చైతన్యం కలిగించేందుకు లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ చెన్నై గోల్డెన్‌ హ్యాండ్స్‌ ఆధ్వర్యంలో చెన్నై నుంచి ల డక్‌ వరకూ సైకిల్‌యాత్ర చేపట్టాడు. తమిళనాడు లోని తంజావూరుకు చెందిన 2 సంవత్సరాల  చి న్నారి  భారతి కేన్సర్‌తో బాధపడుతోంది. చికిత్సకు సుమారు రూ.16 కోట్లు  ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. చిరుద్యోగి అయిన ఆ బాలిక తండ్రి రా జేష్‌ స్వచ్ఛంద సంస్థల సహకారం కోరారు. ఈ నేప థ్యంలో లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ చెన్నై గోల్డెన్‌ హ్యాండ్స్‌ సౌ జన్యంతో చెన్నైకు చెంది (పేరు చెప్పటానికి ఇష్టప డ లేదు) ఎంఎస్‌పీ పూర్తి చేసిన యువకుడు సైకి ల్‌యాత్ర ప్రారంభించాడు. 20వ తేదీన చెన్నైలో యాత్ర ప్రారంభించిన అతను మంగళవారం అద్దం కి చేరుకున్నాడు. ఈ యాత్ర లడక్‌ వరకు సుమా రు 3100 కి.మీ సాగుతుందని ఆయన తెలిపారు. రోజుకు 50 నుంచి 100 కి.మీ ప్రయాణిస్తున్నట్లు తెలిపాడు. తన తల్లి తమిల్‌సెల్వి క్యాన్సర్‌తో బాధ పడుతూ చికిత్స పొందుతున్నప్పటికీ, అదే మహ మ్మారితో బాధపడుతున్న ఓ చిన్నారికి వైద్యం కో సం ప్రజలను చైతన్యవంతం చేసే బాధ్యత తీసు కొని సైకిల్‌ యాత్ర చేస్తున్న ఆ యువకుడిని పలు వురు అభినందించారు. భారతి వైద్యం కోసం సహా యం చేయదలచుకున్న దాతులు 9600026891 సె ల్‌నెంబర్‌కు పంపాలని ఆ యువకుడు కోరాడు. 


Updated Date - 2021-09-29T06:02:33+05:30 IST