చినుకు పలకరింపు

ABN , First Publish Date - 2022-06-29T06:17:16+05:30 IST

చాలా రోజుల తర్వాత జిల్లాను చినుకులు పలకరించాయి. పలుచోట్ల మంగళవారం తెల్లవారుజామున జల్లులు పడ్డాయి.

చినుకు పలకరింపు

ఒంగోలు జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): చాలా రోజుల తర్వాత జిల్లాను చినుకులు పలకరించాయి. పలుచోట్ల మంగళవారం తెల్లవారుజామున జల్లులు పడ్డాయి. అంతేకాక వాతావరణం పూర్తిగా చల్లబడటంతోపాటు మంగళవారం రోజంతా మేఘావృతమై ఉంది. మంగళవారం తెల్లవారు జామున పలు ప్రాంతాల్లో జల్లులు పడ్డాయి. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో పరిశీలిస్తే కొండపి మండలంలో అత్యధికంగా 34.50మి.మీ వర్షపాతం నమోదైంది. టంగుటూరులో 28.0, సంతనూతలపాడులో 27.50, ఒంగోలులో 20.0, చీమకుర్తిలో 19.25, పీసీపల్లిలో 12.50 మి.మీ కురిసింది. పలు ఇతర ప్రాంతాల్లోనూ జల్లులు పడ్డాయి. కొన్ని చోట్ల బెట్టకొచ్చిన తొలకరిపైర్లకు ప్రాణం పోశాయి. ఆకాశం మేఘావృతం కావడంతో వర్షంపై రైతుల్లో ఆశలు చిగురించాయి. 


Updated Date - 2022-06-29T06:17:16+05:30 IST