పీహెచసీ పలకరించేనా?

ABN , First Publish Date - 2021-05-17T06:07:54+05:30 IST

మాడ్గులపల్లి మండలంగా ఏర్పడి ఐదు సంవత్సరాలు పూర్తయినా ఇప్పటివరకు కనీసం ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి నోచుకోలేదు.

పీహెచసీ పలకరించేనా?
మాడ్గులపల్లి మండలం వ్యూ

 మండలకేంద్రంగా ఏర్పడి ఐదేళ్లు
 చికిత్స కోసం పక్క మండలాలకు పరుగులు

మాడ్గులపల్లి, మే 16: 
మాడ్గులపల్లి  మండలంగా ఏర్పడి ఐదు సంవత్సరాలు పూర్తయినా ఇప్పటివరకు కనీసం ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి నోచుకోలేదు. ఏ చిన్న జబ్బుచేసినా ప్రజలు చికిత్స కోసం పక్క మండలాలకు పరుగులు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. 
 మండలం ఏర్పాటు ఇలా..
క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం నూతన మండలాలను ఏర్పాటుచేసింది. ఇందులో భాగంగా త్రిపురారం మండలం నుంచి మూడు గ్రామాలు, వేములపల్లి మండలం నుంచి 13గ్రామాలు, తిప్పర్తి మండలం నుండి ఐదు గ్రామాలు, నిడమనూరు మండలం నుంచి ఏడు గ్రామాలు కలిపి 28గ్రామాలతో నూతనంగా మాడ్గులపల్లి మండలాన్ని ఏర్పాటచేశారు. మండల కేంద్రమైనా సొంత భవనాలు లేకపోవడంతో వివిధ శాఖలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. అత్యవసరమైన ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రం మాత్రం ఏర్పాటుచేయలేదు. మాడ్గులపల్లి, ఇందుగుల గ్రామాల్లో ఉప కేంద్రాలు ఉన్నప్పటికీ అక్కడ కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో ప్రజలు వైద్య సేవలు పొందలేకపోతున్నారు.
 ఆందోళనలో ప్రజలు
కరోనా సెకండ్‌వేవ్‌ విజృంభిస్తుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రస్తుతం కరోనా సెకండ్‌వేవ్‌లో వందల సంఖ్యలో కేసులు పెరగడంతో ప్రజలు భీతిల్లుతున్నారు.  వికలాంగులు, వృద్ధులు కరోనా నిర్ధారణ పరీక్షల కోసం, వ్యాక్సిన్ల కోసం పాత మండలంలోని ఆరోగ్య కేంద్రాలకు వెళ్లడంతో అక్కడ స్థానికులకు మాత్రమే అవకాశం కల్పించడంతో వేచి చూసి వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.   ఇప్పటికైనా మండల కేంద్రంలో ప్రాఽఽథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుచేయాలని ప్రజలు కోరుతున్నారు.
 తక్షణమే ఆసుపత్రిని ఏర్పాటుచేయాలి
- పుల్లెంల సైదులు , జడ్పీటీసీ

 మండల కేంద్రంలో కొవిడ్‌ టెస్టులు నిర్వహించేందుకు అద్దె భవనాన్ని అయి నా తీసుకుని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రభుత్వం చేపట్టాలి. పక్క మండలాలకు పరీక్షల కోసం వెళ్తే రెండు, మూడు రోజులు తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. అధికారులు స్పందించి పీహెచసీని ఏర్పాటుచేయాలి.
 ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం
-మంగా యాదయ్య, సర్పంచ,  తోపుచర్ల

కరోనా లక్షణాలు ఉండడంతో టెస్టుల కోసం వెళ్లాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మండల కేంద్రంలో ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రం లేకపోవడంతో పక్క మండలాలైన వేములపల్లి, తిప్పర్తికి వెళ్లాల్సి వస్తోంది. అక్కడికి వెళ్లినా పూర్థిస్థాయిలో టెస్టులు చేయడంతో వెనుదిరగాల్సి వస్తోంది.

Updated Date - 2021-05-17T06:07:54+05:30 IST