ఎమ్మెల్సీ యాదవరెడ్డికి నాయకుల అభినందనలు

ABN , First Publish Date - 2022-01-28T06:00:13+05:30 IST

ఎమ్మెల్సీగా గెలిచిన కల్వకుంట్ల కవిత, డాక్టర్‌ యాదవరెడ్డికి సిద్దిపేట జడ్పీ చైర్‌పర్సన్‌ దంపతులు రోజా రాధాకృష్ణశర్మ దంపతులు గురువారం అభినందనలు తెలియజేశారు. శాసనమండిలో యాదవరెడ్డి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరైన సందర్భంగా వారు ఎమ్మెల్సీలను కలిసి సన్మానించారు.

ఎమ్మెల్సీ యాదవరెడ్డికి నాయకుల అభినందనలు

సిద్దిపేట రూరల్‌, జనవరి 27 :  ఎమ్మెల్సీగా గెలిచిన కల్వకుంట్ల కవిత, డాక్టర్‌ యాదవరెడ్డికి సిద్దిపేట జడ్పీ చైర్‌పర్సన్‌ దంపతులు రోజా రాధాకృష్ణశర్మ దంపతులు గురువారం అభినందనలు తెలియజేశారు. యాదవరెడ్డి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరైన సందర్భంగా వారు ఎమ్మెల్సీలను కలిసి సన్మానించారు.


ఎమ్మెల్సీకి గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ శుభాకాంక్షలు

కొండపాక/జగదేవ్‌పూర్‌/తొగుట/వర్గల్‌, జనవరి 27: మెదక్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన యాదవరెడ్డికి జిల్లాకు చెందిన పలువురు నాయకులు అభినందనలు తెలిపారు. సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఆయనవెంట టీఆర్‌ఎస్‌ కొండపాక మండల అధ్యక్షుడు కుమార్‌యాదవ్‌, వర్గల్‌ మండల అధ్యక్షుడు నాగరాజు, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ అమరేందర్‌, లింగాయపల్లి యాదగిరి తదితరులు ఉన్నారు. అలాగే, జగదేవ్‌పూర్‌ మండల ఆత్మ కమిటీ చైర్మన్‌ రంగారెడ్డి, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ సుధాకర్‌రెడ్డి, కొండపోచమ్మ ఆలయ చైర్మన్‌ ఉపేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ యువజన విభాగం జిల్లా కార్యదర్శి బాలయ్య, రైతుబంధు మండల కోఆర్డినేటర్‌ శ్రీనివా్‌సరెడ్డి ఎమ్మెల్సీ యాదవరెడ్డి ప్రమాణ స్వీకారానికి హాజరై శుభాకాంక్షలు తెలిపారు. తొగుట మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు రాంరెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు చిలువేరి రాంరెడ్డి, వర్గల్‌ జడ్పీటీసీ బాలు యాదవ్‌, ఎంపీపీ లత రమేశ్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నాగరాజు, ఎంపీటీసీ వెంకటేశ్‌, మల్లేష్‌, రాజరాం ఎమ్మెల్సీకి శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2022-01-28T06:00:13+05:30 IST