గ్రీన్‌ఫీల్డ్‌ భూములను రీసర్వే చేయాలి

ABN , First Publish Date - 2020-11-28T04:36:43+05:30 IST

గ్రీన్‌ఫీల్డ్‌ హైవే రీ నోటిఫికేషన్‌-2019ప్రకారం రెవెన్యూశాఖ తరపున నిర్వహించిన సర్వే తప్పులతడకగా మారిందని, దీంతో రీసర్వే చేస్తూ 3జీ(అవార్డు భూములకు సబందించి అభ్యంతరాలు, భూముల విలువ తెలియపరచడం) విచారణను వాయిదా వేయాలని శుక్రవారం కల్లూరు ఆర్డీవో కార్యాలయంలో అదనపు కలెక్టర్‌ సమక్షంలో బాధిత రైతులు డిమాండ్‌ చేశారు.

గ్రీన్‌ఫీల్డ్‌ భూములను రీసర్వే చేయాలి
అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్న బాధిత రైతులు

అదనపు కలెక్టర్‌కు రైతుల వినతి

కల్లూరు, నవంబరు 27: గ్రీన్‌ఫీల్డ్‌ హైవే రీ నోటిఫికేషన్‌-2019ప్రకారం రెవెన్యూశాఖ తరపున నిర్వహించిన సర్వే తప్పులతడకగా మారిందని, దీంతో రీసర్వే చేస్తూ 3జీ(అవార్డు భూములకు సబందించి అభ్యంతరాలు, భూముల విలువ తెలియపరచడం) విచారణను వాయిదా వేయాలని శుక్రవారం కల్లూరు ఆర్డీవో కార్యాలయంలో అదనపు కలెక్టర్‌ సమక్షంలో బాధిత రైతులు డిమాండ్‌ చేశారు. మండలంలోని ఓబుల్‌రావుబంజర్‌, లింగాల, ముచ్చవరం, చండ్రుపట్ల, పేరువంచ గ్రామాల రైతులు ఈ విచారణకు హాజరయ్యారు. గ్రీన్‌ఫీల్డ్‌హైవే జేఏసీ నాయకులు మేడా గోపాలకృష్ణ వల్లభనేని రవి, గాదె వెంకట్రావ్‌, కాటమనేని రామారావు మాట్లాడుతూ 3డీ(ప్రభుత్వ ఆదీనంలో భూములు ఉండటం) విచారణలో ఎన్‌హెచ్‌ ఫ్లానింగ్‌ మార్క్‌ పెట్టారని బాధిత రైతులతో అదనపు కలెక్టర్‌ చెప్పారని, ఆంధ్రా భూముల ధరలకు సమానంగా గ్రీన్‌ఫీల్డ్‌ రైతులకు పరిహారం కూడా ఇస్తామని కూడా గుర్తుచేశారు. గ్రీన్‌ఫీల్డ్‌హైవే భూసేకరణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్‌ ధర రూ.2నుంచి రూ.3లక్షల వరకు ఉందని నిబంధనల ప్రకారం రూ.ఆరున్నర నుంచి రూ.ఏడున్నర లక్షల వరకు పరిహారం అందుతుందని అధికారులు చెప్పారన్నారు. తమ స్థాయిలో ప్రభుత్వం తరపున రూ.20లక్షలు పరిహారం అందిస్తామని అదనపు కలెక్టర్‌ చెప్పారన్నారు. ఏపీలో ఉన్న మార్కెట్‌ ధర ప్రకారం ఎకరాకు రూ.40నుంచి రూ.50లక్షల వరకు పరిహారం అందించాలని అదనపు కలెక్టర్‌ను కోరారు. ఈమేరకు అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. తహసీల్దార్‌ మంగీలాల్‌, రైతులు పాల్గొన్నారు.


Updated Date - 2020-11-28T04:36:43+05:30 IST