Abn logo
Sep 21 2021 @ 23:27PM

పార్కులో పచ్చదనం పెంచాలి : కమిషనర్‌

వైఎంఆర్‌ కాలనీలోని పార్కును పరిశీలిస్తున్న కమిషనర్‌ శివారెడ్డి

ప్రొద్దుటూరు అర్బన్‌ సెప్టెంబరు 21 : ఉద్యానవనాల్లో పచ్చదనం పెంచి ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని  కమిషనర్‌ వెంకట శివారెడ్డి సిబ్బందికు సూచించారు. మంగళవారం అసిస్టెంట్‌ కమిష నర్‌ గంగా ప్రసాద్‌తో కలిసి వైఎం ఆర్‌ కాలనీలో పారిశుధ్య పనుల తోపాటు  పార్కులో పచ్చదనం ఆహ్లాద వాతావరణాన్ని కమిషనర్‌  పరిశీలించారు. ఈ సందర్బంగా పార్కులో పచ్చదనం లేక మొక్క లు ఎండిపోయివుండటాన్ని పరి శీలించి సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. పార్కులో పచ్చ దనం పెంచటంలో చొరవచూపాల ని ఆదేశించారు. పట్టణంలో పారి శుధ్యం మెరుగుపరచాలని ఆయన మున్సిపల్‌ సిబ్బందిని ఆదేశించా రు. ఈ కార్యకమంలో కమిషనర్‌ వెంట ప్రజాఆరోగ్య శాఖ సిబ్బంది ఉన్నారు.