Abn logo
Jun 17 2021 @ 00:09AM

హరితహారంలో భాగస్వాములు కావాలి

పోచారంలో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవి

మేడ్చల్‌: ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతీ ఒక్కరు భాగస్వాములై మొక్కలు నాటాలని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్‌ మండలం గౌడవెల్లిగ్రామం సాకేత్‌ భూసత్వాలో నిర్వహించిన హరితహారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలన్నారు. రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చేందుకు అందరూ కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అటవీశాఖ సంస్థ చైర్మన్‌ ఒంటేరు ప్రతా్‌పరెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గ, పార్లమెంటు ఇన్‌చార్జిలు మర్రి రాజశేఖర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, ఎంపీపీ పద్మాజగన్‌రెడ్డి, రాజు,  శ్రీనివా్‌సరెడ్డి, శేఖర్‌గౌడ్‌, మోహన్‌రెడ్డి, నర్సింహారెడ్డి, నర్సింహాగౌడ్‌,   ప్రదీ్‌పసింగ్‌, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.  


  • రూ.1.86కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

ఘట్‌కేసర్‌: రాష్ట్రాన్ని అభివృద్ధ్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్‌ జిల్లా పోచారం మున్సిపాలిటీలో 1.86కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి, ఎమెల్సీ సురభి వాణీదేవితో కలిసి శంకుస్థానలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం అవసరమైన నిధులను మంజూరు చేస్తున్నదన్నారు.  మున్సిపాలిటీలోని 15వ వార్డులోని గణే్‌షనగర్‌లో రూ.14లక్షలతో బీ టీ రోడ్డు నిర్మాణ పనులు, 17వ వార్డులోని మహాలక్ష్మీపురంలో బీటీ రోడ్డు విస్తరణకు రూ.27లక్షలతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు. 12వ వార్డులోని సంస్కృతి టౌన్‌షి్‌పలో రూ.10.56లక్షలతో ఏ ర్పాటు చేసిన జిమ్‌ను ప్రారంభించారు. 5వ వార్డులోని సాయి ప్రగతినగర్‌లో రూ.30లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణ పనులు, రాజీవ్‌ గుహకల్ప కాలనీలో రూ.25లక్షలతో నిర్మించనున్న షాపింగ్‌ కాంప్లెక్స్‌కు, రూ.45లక్షలతో డ్రైనేజీ పనులు, కాలనీలో రూ.35లక్షలతో చేపట్టనున్న మురుగునీటి శుద్ధి ప్లాంట్‌ పనులకు శంకుస్థానలు చేశారు. కార్యక్రమంలో చైర్మన్‌ కొండల్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌ రెడ్డియానాయక్‌, కమిషనర్‌ సురేష్‌, కౌన్సిలర్లు మహేష్‌, సాయిరెడ్డి, వెంకటేష్‌, ఆకిటి శైలజ, బైర హిమ, బాల్‌రెడ్డి, హరిప్రసాద్‌రావు, రవీందర్‌, సరిత, మోటుపల్లి పో చమ్మ, సుధాలక్ష్మి, నాయకులు సురేందర్‌రెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, గొంగళ్ల బాలేష్‌, నల్లవెల్లి శేఖర్‌, నర్సింహ పాల్గొన్నారు.


  • ఎమ్మెల్సీ వాణీదేవికి సన్మానం


ఎమ్మెల్సీగా మొదటి సారి ఘట్‌కేసర్‌కు వచ్చిన సురభి వాణీదేవిని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ముల్లి పావని ఆధ్వర్యంలో సన్మానించారు. ఎ మ్మెల్యే క్యాంప్‌ కార్యాయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డితో కలిసి ఆమె ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మున్సిపల్‌ సిబ్బందికి, చిరు వ్యాపారులకు శానిటైజర్లు పంపిణీ చేశారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, చైర్‌పర్సన్‌ పావని జంగయ్యయాదవ్‌, వైస్‌చైర్మన్‌ పల్గుల మాధవరెడ్డి, కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు.


  • గ్రామాల అభివృద్ధికి బాల వికాస్‌ సేవలు అభినందనీయం


కీసర: గ్రామాల అభివృద్ధికి బాలవికాస్‌ సేవలు అభినందదనీయమని కార్మిక శాఖ మంత్రి సీహెచ్‌.మల్లారెడ్డి అన్నారు. రాంపల్లిదా యరలో, బాలవికాస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ అధ్వర్యంలో రూ.20లక్షల తో నిర్మించనున్న మల్టీపర్పస్‌ పార్కుకు మంత్రి.. జడ్పీచైర్మన్‌ శరత్‌చంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఎస్‌.వాణిదేవితో కలిసి శంకుస్థాపన చేశారు. జడ్పీ వైస్‌చైర్మన్‌ వెంకటేష్‌, ఎంపీపీ ఇందిర, వైస్‌ఎంపీపీ సత్తిరెడ్డి, సర్పంచ్‌ ఆండాలు, ఉపసర్పంచ్‌ రాము తదితరులు పాల్గొన్నారు.