హరితహారాన్ని విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2020-07-14T09:59:51+05:30 IST

హరితహారం కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు విజయవంతం చేయాలని వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు

హరితహారాన్ని విజయవంతం చేయాలి

 కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు


కమలాపూర్‌, జూలై 13 :  హరితహారం కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు విజయవంతం చేయాలని వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు పిలుపునిచ్చారు. మండలంలోని ఉప్పలపల్లి, మర్రిపల్లి గ్రామాల్లో సోమవారం నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొని మొక్కలు నాటారు. ఉప్పలపల్లిలో రైతు కల్లం నిర్మాణ పనులను ప్రారంభించారు.


  ప్రతీ గ్రామంలో పార్కు ఉండాలని, పల్లె ప్రకృతి వనంలో పూల మొక్కలతో పాటు వాకింగ్‌ ట్రాక్‌లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీ మండలంలో నాలుగు, ఐదు మంకీ ఫుడ్‌ కోర్టులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆగస్టు 15 వరకు వైకుంఠదామాలను, కంపోస్టు షెడ్ల నిర్మాణ పనులను పూర్తి చేయాలన్నారు. మండల కేంద్రంలోని డబుల్‌ బెడ్‌ రూం నిర్మాణ పనులను పరిశీలించారు. పనులను త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఉప్పల్‌లో పందుల బెడదను తొలగించాలని స్థానిక ప్రజాప్రతినిధులు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.


మర్రిపల్లిగూడెంలోని బీసీల ప్లాట్లల్లో రైతు వేదిక నిర్మాణాన్ని నిలిపివేయాలని ఆ గ్రామస్థులు కలెక్టర్‌ను కోరారు. డీఆర్‌డీవో శ్రీనివాస్‌కుమార్‌, ఎంపీపీ రాణి, జడ్పీటీసీ కళ్యాణి, సింగల్‌ విండో చైర్మన్‌ సంపత్‌రావు, సర్పంచ్‌లు ఉమ, రజిత, ఎంపీటీసీలు సంపత్‌రావు, అరుణ, తహసీల్దార్‌ జ్యోతి వరలక్ష్మీదేవి, ఎంపీడీవో విజయ్‌కుమార్‌, ఏపీవో రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-07-14T09:59:51+05:30 IST