సస్టెయినబుల్‌ సైన్స్‌పై గ్రీన్‌కో స్కూల్‌

ABN , First Publish Date - 2022-07-05T08:18:14+05:30 IST

హైదరాబాద్‌కు చెందిన పర్యా వరణ అనుకూల ఇంధన కంపెనీ గ్రీన్‌కో సస్టెయినబుల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కోసం ప్రత్యేక స్కూల్‌ను ఏర్పాటు చేస్తోంది.

సస్టెయినబుల్‌ సైన్స్‌పై గ్రీన్‌కో స్కూల్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌కు చెందిన పర్యా వరణ అనుకూల ఇంధన కంపెనీ గ్రీన్‌కో సస్టెయినబుల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కోసం ప్రత్యేక స్కూల్‌ను ఏర్పాటు చేస్తోంది. సస్టెయినబుల్‌ ఎనర్జీ, పర్యావరణంపై పరిశోధన, విద్య కోసం దేశంలో తొలిసారిగా ఇటువంటి స్కూల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. గ్రీన్‌కో స్కూల్‌ ఆఫ్‌ సస్టెయినబుల్‌ అండ్‌ టెక్నాలజీ (జీఎస్‌ఎస్‌ఎస్‌టీ).. బీటెక్‌ ప్రొగ్రామ్స్‌ను పూర్తి చేసిన విద్యార్థులకు ఎంటెక్‌, పీహెచ్‌డీలను ఆఫర్‌ చేస్తుందని గ్రీన్‌కో గ్రూప్‌ సీఈఓ, ఎండీ అనిల్‌ చలమలశెట్టి తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ స్కూల్‌ ప్రారంభమవుతుందని, వచ్చే ఏడాది జూన్‌ నాటికి కోర్సులను ఆఫర్‌ చేస్తుందన్నారు స్కూల్‌ ఏర్పాటుకు ఐఐటీ, హైదరాబాద్‌తో గ్రీన్‌కో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 

Updated Date - 2022-07-05T08:18:14+05:30 IST