కరువు నేలలో పచ్చటి సిరులు

ABN , First Publish Date - 2021-04-19T04:55:15+05:30 IST

మంచాల మండలం వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు పొందింది.

కరువు నేలలో పచ్చటి సిరులు
మంచాలలో కంకుల దశలో ఉన్న వరిచేను

మంచాల : మంచాల మండలం వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు పొందింది. గతంలో ఎడారులను తలపించేలా పొలాలు.. వట్టి పోయిన బావులు దర్శనమిచ్చేవి. పనులు లేక వ్యవసాయ కూలీలు, రైతులు వలసలు వెళ్లేవారు. కాగా ఈ ఏడాది అన్న దాతల దశ తిరిగింది. సమృద్ధిగా వర్షాలు కురువడంతో చెరువులు, కుంటలు నిండి బోర్లలో సమృద్ధిగా నీటి లభ్యత ఏర్ప డింది. రికార్డుస్థాయిలో రబీసాగు చేపట్టారు. దీంతో గ్రామాల్లో ఎక్కడ చూసినా కరువు నేలలో పచ్చటి సిరులు దర్శనమి స్తున్నాయి. ఈసారి కురిసిన వర్షాలతో అన్నదాతలకు పశుగ్రాసం కొరత కూడా తీరింది. మండల పరిధిలో ఎక్కువ మొత్తంలో వరి, కూరగాయ పంటల సాగుచేపట్టారు. సాధారణ సాగు విస్తీర్ణం 15,352 ఎకరాలు ఉండగా.. ఈసారి 8,012 వరి, 1000 ఎకరాలకు పైగా కూరగాయలు, మరో 1000ఎకరాలు ఆకు కూరలు, 700 ఎకరాల్లో పండ్ల తోటలు సాగయ్యాయి. 



Updated Date - 2021-04-19T04:55:15+05:30 IST