హరిత తెలంగాణలో భాగస్వాములు కావాలి

ABN , First Publish Date - 2020-07-11T09:39:15+05:30 IST

హరిత తెలం గాణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల ని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు కోరారు.

హరిత తెలంగాణలో భాగస్వాములు కావాలి

మంచిర్యాల టౌన్‌, జూలై 10: హరిత తెలం గాణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల ని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు కోరారు.  హరితహారంలో భాగంగా శుక్రవారం పాత మంచిర్యాల 8వ వార్డులో మొక్కలు నాటి, నీళ్లు పోశారు. నాటిన మొక్కలను సంరక్షించుకొని పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని పిలుపుని చ్చారు. మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య, కమిషనర్‌ స్వరూపారాణి, కౌన్సిలర్‌ సునీత కిష న్‌, డీసీసీబీ డైరెక్టర్‌ తిరుపతి పాల్గొన్నారు. 


జన్నారం: పొన్కల్‌ గ్రామపంచాయతీ పరిధి లోని పుట్టిగూడ లయన్స్‌క్లబ్‌ భవన సమీపంలో  క్లబ్‌ అధ్యక్షుడు రంజిత్‌రావు మొ క్కలు నాటారు. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి కాపాడాలన్నారు. సునీల్‌కుమార్‌, మణికుమార్‌, శ్రీరాంరెడ్డి, రాజన్న పాల్గొన్నారు. 


బెల్లంపల్లి టౌన్‌: హరిత హారంలో భాగంగా బెల్లంపల్లిలో వర్షాన్ని కూడా లెక్క చేయకుండా  కమిషనర్‌ ఆకుల వెంకటేష్‌ టేకులబస్తి, ప్రధాన రహదారి డివైడర్లపై మొక్కలు నాటించారు.  మొక్కలు కాపాడేందుకు ప్రజలు వ్యక్తిగత బా ధ్యత తీసుకోవాలని, మొక్కలకు ప్లాస్టిక్‌ జాలి ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇంజనీర్‌ హరికాంత్‌ ఉన్నారు. 

Updated Date - 2020-07-11T09:39:15+05:30 IST