రెండు స్పూన్లకు మించకుండా తీసుకుంటే..

ABN , First Publish Date - 2020-07-05T17:58:36+05:30 IST

మధుమేహం ఉన్నవారు గ్రీన్‌ టీలో తేనె వాడవచ్చా?

రెండు స్పూన్లకు మించకుండా తీసుకుంటే..

ఆంధ్రజ్యోతి(05-07-2020)

ప్రశ్న: మధుమేహం ఉన్నవారు గ్రీన్‌ టీలో తేనె వాడవచ్చా?


- మహా సర్వ, హైదరాబాద్‌


డాక్టర్ సమాధానం: ఓ స్పూను లేదా ఇరవై గ్రాముల తేనెలో అరవై ఐదు కెలోరీలు ఉంటాయి,  తేనెలో పలు రకాల విటమిన్లు, ఖనిజాలు ఉన్నా అవి మన శరీరానికి అవసరమయ్యే మోతాదుల్లో కావాలంటే కనీసం అరకిలో తేనె తీసుకోవాలి. అందుకే శక్తినిచ్చే పదార్థాలు, ఆంటీ ఆక్సిడెంట్ల కోసం మాత్రమే, పరిమిత మోతాదుల్లో తేనెను తీసుకోవాలి. తేనె వచ్చిన మొక్కల జాతిని బట్టి, కాలాన్ని బట్టి కూడా తేనెలోని యాంటీ ఆక్సిడెంట్లు మారుతాయి. ముదురు రంగులో ఉన్న తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. పరిమిత మోతాదుల్లో తీసుకుంటే తేనె మన ఆరోగ్యాన్ని కాపాడుతూ, రక్తపోటును, కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిసెరైడ్స్‌ను అదుపులో ఉంచడానికి ఉపయోగపడుతుంది. పంచదార కంటే తేనె వాడినప్పుడు రక్తంలో గ్లూకోజు తక్కువగా పెరుగుతుంది. ఎక్కువ తీయగా ఉండడం వల్ల తక్కువ తేనె వేసుకున్నా తీపి సరిపోతుంది. అందుకే తేనెను చక్కెరకుప్రత్యామ్నాయంగా వాడవచ్చు. కానీ మధుమేహం ఉన్న వారు కేవలం తీపి పదార్థాలనే కాక అన్ని రకాల పిండిపదార్ధాలను నియంత్రించి తీసుకోవాలి. వీరు రోజుకు రెండు టీ స్పూనులకు మించకుండా (పది గ్రాములు) తేనె తీసుకోవడం వల్ల ఇబ్బంది ఉండదు.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు) 

Updated Date - 2020-07-05T17:58:36+05:30 IST