Advertisement
Advertisement
Abn logo
Advertisement

హృదయం పదిలంగా ఉండడానికి...

ఆంధ్రజ్యోతి(20-03-2020)


గ్రీన్‌ టీతో జీవితకాలం పెంపు

వారానికి మూడు సార్లు గ్రీన్‌ టీ తాగితే మనిషి జీవితకాలం పెరగడంతో పాటు గుండెపోటు, స్ర్టోక్‌ ముప్పులను నివారించవచ్చని తాజా అధ్యయనం స్పష్టం చేస్తోంది. గ్రీన్‌ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్‌తో హృదయం పదిలంగా ఉండటంతో పాటు ఎక్కువకాలం ఆరోగ్యకరంగా జీవించేందుకు దోహదపడుతుందని పరిశోధకులు తేల్చారు. చైనాలో లక్ష మందిపై జరిపిన అధ్యయనంలో గ్రీన్‌ టీ తాగేవారు తాగని వారితో పోలిస్తే సగటున 1.26 సంవత్సరాలు అధికంగా జీవించినట్టు గుర్తించారు. బ్లాక్‌ టీ తాగిన వారిలో ఇలాంటి ప్రయోజనాలను గుర్తించలేదని పరిశోధకులు తెలిపారు. అయితే కేవలం మంచి ఆరోగ్యం కోసం గ్రీన్‌ టీకి మారితే మెరుగైన ఫలితాలు రావనీ, ఇతర అనారోగ్య అలవాట్లను మానకపోతే ఎలాంటి ఫలితాన్ని పొందలేరనీ వారు స్పష్టం చేస్తున్నారు. ప్రతిరోజూ టీ తాగడం అలవాటుగా చేసకున్నవారికి గుండె జబ్బులు, ఇతర కారణాలతో మరణించే రిస్క్‌ తక్కువగా ఉంటుందని మరో అధ్యయనంలో తేలింది. 

Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...